గద్వాల్ RTC డిపో మేనేజర్ కు ఐజ అఖిల పక్ష కమిటి వినతి పత్రం అందజేత
ఐజ నుండి బలిగెర మీదుగా ఎరగెర వరకు తెలంగాణ సెటిల్ బస్సు నడుపుట గురించి
తప్పకుండా నడుపుతామని ఆర్టీసీ డిపో మేనేజర్ హామీ
జోగులాంబ గద్వాల 20 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి: అఖిల పక్షి కమిటీ తరఫున మనవి చేయునది ఏమనగా తెలంగాణ రాష్ట్రం రాకపూర్వము కర్నూల్ డిపో నుండి అయిజ మీదుగా రాయచూర్ బస్సులు ఎన్నో నడిచేవి తెలంగాణ వచ్చిన తర్వాత బస్సులు బంద్ అయ్యాయి.గద్వాల డిపో నుండి రాయచూరు బస్సులు ఉన్నాయి. ఐజ మీదుగా రాయచూర్ కు బస్సులు లేవనే విషయం మీకు తెలిసిందే. ఐజ నుండి మంత్రాలయం వరకు ఒక్క బస్సు మాత్రమే ఉన్నది. దీంతో సుమారు 15 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాయచూరు నుండి మంత్రాలయం, ఆదోని తదితర ప్రాంతాల నుండి గట్టు మండలం అనేక ప్రాంతాల ప్రజలు తెలంగాణ బస్సు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
కావున ఐజ నుండి బలిగెర మీదుగా ఎరగెర వరకు ఒక సెటిల్ బస్ నడపగలరని కోరుచున్నాము. ముఖ్యంగా ఆయా గ్రామాల నుండి వచ్చే విద్యార్థులు ప్రైవేట్ వాహనాలపై, ఆటోలపై, ప్రయాణించి ప్రమాదానికి గుర వుతున్నారు.సుమారు 20 గ్రామా ల ప్రజలు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కోల్పోతున్నారు. కావున ప్రజా సమస్యలపై త్వరగా స్పందించే మీరు ఈ విషయంపై కూడా తగు నిర్ణయం తీసుకొని ఐజ ఎరిగెర బస్సు నడిపితే మంచి కలెక్షన్లతో పాటు ప్రజలకు మేలు చేసిన వారు అవుతారని మనవి చేయుచున్నాం.
ఈ రూట్లో సంకాపురం, ఈడిగోని పల్లి, తుమ్మలపల్లి, మిట్టదొడ్డి, చాగదోన, చిన్నోనిపల్లి, ముచ్చోనిపల్లి, ఇందువాసి, బలిగెర, మాచర్ల,బోయిలగూడెం, చమన్ ఖాన్ దొడ్డి, గొర్లఖాన్ దొడ్డి, గట్టు లాంటి గ్రామాలకు సౌకర్యంగా ఉంటుంది. దయచేసి పరిశీలించి నిర్ణయం తీసుకోగలరు ప్రార్థన.
ఈ కార్యక్రమంలో నాగర్ దొడ్డి వెంకట రాములు, సిపిఐ ఆంజనేయులు, దండోరా ఆంజనేయులు, హనుమంతు, MRPS గట్టు మండలం అధ్యక్షులు బలిగెర ఏసన్న మాదిగ, బుడగ జంగం రాధాకృష్ణ, బాలరంగడు తదితరులు పాల్గొన్నారు.