చెరువు కట్ట పరిమాణం పెంచాలి!బీఎస్పీ రాష్ట్ర నాయకులు బొడ్డు కిరణ్
శాలిగౌరారం 30 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పరిధిలోని ఆకారం గ్రామంలో చెరువు కట్ట పొంగి ప్రవహించడం పట్ల బీఎస్పీ నాయకులు బొడ్డు కిరణ్ హర్షం వ్యక్తం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రస్తుత ప్రభుత్వం ఆకారం గ్రామ చెరువు కట్ట పరిమాణాన్ని పెంచి నీటిని నిల్వ చేసుకునేందుకు మరమ్మతులు చేయాలని దానివల్ల గ్రామంలో భూగర్భ జలాల స్థాయి పెరిగి బోర్లు వేసవి కాలంలో కూడా పోయడానికి అవకాశం ఉందని తెలిపారు. దీని కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.