పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేం.. ఎస్సై వెంకట్ రెడ్డి
అడ్డగూడూరు 30 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని ఎస్సై వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల అమరవీరుల వార్షికోత్సవం సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం మరియు పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా అడ్డగూడూరు మండలం పోలీసు వారు మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తా నందు పోలీస్ ఆధ్వర్యంలో కొవోత్తుల ర్యాలీ నిర్వహించారు.పోలీసు అమరుల త్యాగాలను స్మరించుకోవడం జరిగిందన్నారు. ఇట్టి కార్యక్రమంలో మండల స్థానికులు పాల్గొని విజయవంతం చేశారని ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.