వ్యాసరచన పోటీల్లో మెరిసిన ఆణిముత్యం...! రాష్ట్రస్థాయికి ఎంపిక

Oct 31, 2025 - 19:09
 0  1
వ్యాసరచన పోటీల్లో మెరిసిన ఆణిముత్యం...! రాష్ట్రస్థాయికి ఎంపిక
వ్యాసరచన పోటీల్లో మెరిసిన ఆణిముత్యం...! రాష్ట్రస్థాయికి ఎంపిక

వ్యాసరచన పోటీల్లో జిల్లాలోని ప్రథమ బహుమతిని సాధించిన ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిని పి.సఫియా...

 జోగులాంబ గద్వాల 31 అక్టోబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఎర్రవల్లి మండల కేంద్రంలోని 10వ బెటాలియన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో  "విద్యార్థులలో మాదకద్రవ్యాల నివారణ" అనే అంశంపై నిర్వహించిన వ్యాస రచన పోటీలో ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ CBSE స్కూల్ 10వ తరగతి విద్యార్థిని పి.సఫియా డాటర్ ఆఫ్ కాజా మొదటి బహుమతిని కైవసం చేసుకున్నది.

  ఈ పోటీకి ఈ జోగులాంబ గద్వాల జిల్లాలోని అనేక పాఠశాలల నుండి విద్యార్థులు పాల్గొనగా  యువతలో మాదకద్రవ్యలపై దుర్వినియోగాన్ని అరికట్టడానికి దాని అంతర్దృష్టి వాదనలు, స్పష్టమైన ప్రదర్శన మరియు ఆచరణీయ సూచనల కోసం సఫియా రాసిన వ్యాసం ఎంతగానో ప్రశంసించబడింది. అధికారిక అవార్డు ప్రదానోత్సవంలో, 10వ బెటాలియన్ కమాండెంట్ ఎం.జయరాజు చేతుల మీదుగా బహుమతిని అందుకున్నది. ఇట్టి బహుమతి గెలుపొందిన పి.సఫియాకు అభినందించిన పాఠశాల చైర్మన్ శ్రీ గోవర్ధన్ రెడ్డి. రాష్ట్రస్థాయికి ఎంపిక అవడం అన్నది మన పాఠశాల అవునత్యాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషించినందుకుగాను అభినందిస్తూ  హర్షం వ్యక్తం చేశారు.

   ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ శ్రీ వీర శ్రీనివాస్ రెడ్డి, కరెస్పాండెంట్ శ్రీమతి మధులిక రెడ్డి, ప్రిన్సిపాల్ సుధీర్ కుమార్, మరియు అధ్యాపక బృందం విద్యార్థులు  అభినందించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333