వ్వులే నవ్వులు జోక్స్ రచయిత కు సన్మానం

జోగులాంబ గద్వాల 14 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి:-
శాంతినగర్ వాసి ప్రముఖ రచయిత షేక్ అస్లాం షరీఫ్ కు స్ఫూర్తి సేవా సమితి డోన్ వారు నవ్వులే నవ్వులు జోక్స్ పుస్తకం రచించిననందుకు డోన్ సమీపంలో జాతీయ రహదారి పై ఉన్న శ్రీ కాశీ నాయన వృద్ద ఆశ్రమం లో ఆదివారం శాలువా తో సన్మానం చేశారు. ఈ సందర్బంగా నిర్వాహకులు మాట్లాడుతు" అస్లాం రచనలు బాగుంటాయి అని, జోక్స్ బాగా నవ్విస్తాయి అని, యూట్యూబ్ ద్వారా అందరిని అలరిస్తున్నారని, సేవా కార్యక్రమముల ద్వారా అందరివాడు గా మన్ననలు పండుతున్నరని అన్నారు. ఈ కార్యక్రమం లో స్ఫూర్తి సేవా సమితి నిర్వాహకులు మధు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.