చిర్రగూడూర్ గ్రామానికి చెందిన మహిళకు డాక్టర్ రేట్

అడ్డగూడూరు 29 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలో చిర్రగూడూర్ గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ శ్రీరాముల జ్యోతిఅయోధ్యల మొదటి కూతురు ఝాన్సీరాణి శ్రీరాములకు.ఉస్మానియా యూనివర్సిటీ విశ్వ విద్యాలయంలో పార్మాసి డిపార్ట్మెంట్ లోని ఎనలైటికల్ మెథడ్,డెవలప్మెంట్ అండ్ వాల్యిడేషన్ ఆఫ్ యాంటి క్యాన్సర్ అండ్ యాంటీ హైపర్ టెష్సన్ డ్రగ్స్ బై యూజింగ్ యు పి ఎల్ సి,హెచ్ పి ఎల్ సి,ఎల్ సి ఎం ఎస్/ఎమ్మెస్ లో డాక్టరేట్ పొందడం జరిగింది. ప్రోపేసర్ శివరాజ్ పర్యావేక్షణలో పరిశోధన (రిసెర్చ్)చేయడం జరిగింది.గత 5 సంవత్సరాల కాలంలో పలు పరిశోధనలు(రిసెర్చ్) విజయవంతం కావడంతో నిన్నటిరోజున హెచ్ వోడి ఫ్రోపెసర్ రమేష్ ,ఫ్రోపేసర్ మాధవరెడ్డి,ప్రోపేసర్ జ్యోతిల చేతుల మీదుగా పిహెచ్ డి డాక్టరేట్ పట్టాను పొందడం జరిగింది.కుటుంబ సభ్యులు భర్త మందుల అమృతం,కుమారుడు మందుల రోషన్ 2012వ సంవత్సరంలో వివాహం అయిన తర్వాత తన భర్త మరియు తల్లిదండ్రుల సహాకారంతో వారి అండదండలతో కుటుంబాన్ని ఒక చేతులో మోస్తూ మరోక చేతిలో పిహెచ్ డి పట్టాను పొందాలనే ధృడ సంకల్పంతో కుటుంబలో ఎన్ని ఆటుపోటూలు ఎదురయిన చదవాలనే కోరిక ముందు అవన్ని పటాపంచాలయి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మసీ లో పిహెచ్ డి డాక్టరేట్ పట్టాను పొందడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న మండల ప్రజలు యువత,ప్రజా ప్రతినిధులు ఝాన్సీ రాణికి శుభాకాంక్షలు తెలుపుతూ..మండలంలోని యువత కూడా చదువులో ఝాన్సీ రాణిని ఆదర్శంగా తీసుకోని చదువులో ముందుకు సాగాలని మండల ప్రజలు కోరారు.