గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీచేసిన ఎమ్మెల్యే
డాక్టర్ రాంచందర్ నాయక్ మహబూబాబాద్ ఎంపి బలరాం నాయక్ మరిపెడ 04 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- మరిపెడ మండల కేంద్రములోగీత కార్మికులను ఆపద నుండి ఆదుకోవడానికి ప్రభుత్వం ఐఐటీ నిపుణులతో తయారు చేయించిన 'కాటమయ్య రక్షణ కవచం(మోకులు)సేఫ్టీ కిట్లను డాక్టర్ రాంచందర్ నాయక్,మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్ గౌడలన్నకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ, కేసముద్రం మార్కెట్ వైస్ చైర్మన్ ఐలమల్లు,కురవి ఆలయ చైర్మన్ రవీందర్ రెడ్డి, మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ బత్తుల శ్రీనివాస్ యాదవ్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి వీరభద్రం,భట్టు నాయక్ టౌన్ పార్టీ అధ్యక్షులు తాజుద్దీన్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.