తెలంగాణ జర్నలిస్టు ఫోరం 25వ వసంతాల రజతోత్సవాల సభను విజయవంతం చేయండి

అడ్డగూడూరు 29 మే 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- తెలంగాణ జర్నలిస్టు ఫోరం (టీజేఎఫ్) 25 వసంతాల రజతోత్సవాల సభ మే 31 శనివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని జలవిహార్ ఆడిటోరియం నక్లెస్ రోడ్డులో జరిగే సభను విజయవంతం చేయాలని అడ్డగూడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద టియుడబ్ల్యూజే 143 మండల అధ్యక్షులు సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు యూనియన్ నాయకులు మాట్లాడుతూ టీయూడబ్ల్యూజే 143 నాయకులంతా విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కడియం నాగయ్య,చిన్నం వెంకన్న, మార్త రమేష్,శివ, సైదులు తదితరులు పాల్గొన్నారు.