చిన్నమారూర్ గ్రామ పంచాయతీ నిధులు గోల్ మాల్

గ్రామ పంచాయతీ నిధులను అడ్వాన్స్ రూపంలో తీసుకున్న అప్పటి సర్పంచ్
సర్పంచ్ పదవి అయి పోయి రెండేళ్ల అవుతున్న అడ్వాన్స్ నిధులు జమ చేయలేదు
రూ,,4,29,299/-లు ఇప్పటి వరకు జమ చేయని గ్రామ మాజీ సర్పంచ్
చిన్నంబావి మండలం 30సెప్టెంబర్ 2025తెలంగాణ వార్త : చిన్నంబావి మండల పరిధిలోని చిన్నమారుర్ గ్రామ పంచాయతీ ప్రజలు ఎంపీడీవో రామస్వామికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చిన్నమారుర్ గ్రామ పంచాయతీకి 2019 సంవత్సరము నుంచి 2023 సంవత్సరం వరకు సర్పంచ్ పదవిలో ఉన్నవారు చిన్నమారుర్ గ్రామ అభివృద్ధి కొరకు వచ్చిన నిధులు సి ఎఫ్ సి, ఎస్ ఎఫ్ సి, జి పి నిధులను గ్రామ అభివృద్ధి వివిధ రకాలుగా గ్రామంలో ఉన్న సమస్యలు మరియు పనుల కొరకు ఖర్చు పెట్టకుండా ఆ నిధులను వివిధ నిర్మాణాల కొరకు, సెగ్రికేషన్స్ షెడ్డు, డంపింగ్ యార్డ్, క్రీడా ప్రాంగణం, స్మశాన వాటిక నిర్మాణాల కొరకు అడ్వాన్స్ రూపంలో తీసుకొని నిర్మాణాలు చేయడం జరిగింది. ఈ డబ్బులను తిరిగి సర్పంచ్ పదవి కాలం అయి పోయి రెండేళ్లు అవుతున్న గ్రామ పంచాయతీ అకౌంట్ కు జమ చేయలేదు అప్పటి సర్పంచు, ప్రస్తుతం మాజీ సర్పంచ్. ఈ విషయంపై మండల ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ సెక్రెటరీ, అధికారులు నిర్లక్ష్యం వల్ల ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నిధులను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తీసుకోవడం జరిగింది అని ఆడిట్ అధికారులు స్పష్టంగా ఆడిట్ రిపోర్టులో నమోదు చేయడం జరిగింది. తక్షణమే మండల అధికారులు స్పందించి ఈ డబ్బులను రికవరీ చేయించి గ్రామ పంచాయతీ అకౌంట్ కు జమ చేయించాలని గ్రామ అభివృద్ధికి సహకరించాలని అధికారులను గ్రామ ప్రజలందరం కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మద్దిలేటి నాయుడు, మాజీ ఉపసర్పంచ్ బాలపీరు, గుడెపు శివారెడ్డి, గుండా వెంకటస్వామి, మద్దెల కృష్ణయ్య, కేత పోగు బుడ్డయ్య, బీమ్ పోగు తిరుమలేష్, మద్దూరి రామకృష్ణ, మద్దూరి రాజు, గుంపు నాగశేషులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.