సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్ గౌడ్

అడ్డగూడూరు 30 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామానికి చెందిన పిల్లి సతీష్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా వారి తల్లి పిల్లి రమణమ్మకి మెడిసిన్ ఖర్చు హాస్పిటల్లో అయినటువంటి బిల్లును సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ కింద 55వేల రూపాయల చెక్కులు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఆదేశాల మేరకు అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో చెక్కును పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు రాచకొండ సతీష్ గౌడ్,గ్రామ కార్యకర్తలు చిలుకూరు లక్ష్మయ్య వెలిశాల,సోమయ్య,మిర్యాల యాదగిరి,రాచకొండ తిరుమలేష్,గజ్జి నరేష్ తదితరులు పాల్గొన్నారు.