చిన్నమారుర్ గ్రామంలో దుర్గ మాతకు ప్రత్యేక పూజలు

Sep 30, 2025 - 19:13
 0  10
చిన్నమారుర్ గ్రామంలో దుర్గ మాతకు ప్రత్యేక పూజలు

దేవాలయ కమిటీ సభ్యులు గుండా వెంకటస్వామి, దాడి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో

 గ్రామ రైతు కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో 

చిన్నంబావి మండలం 30సెప్టెంబర్ 2025తెలంగాణ వార్త : చిన్నంబావి మండల పరిధిలోని చిన్నమారుర్ గ్రామ పంచాయతీలో గ్రామ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో దేవి నవరాత్రుల్లో సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కొలువైన దుర్గ మాత కార్యక్రమాలు ఘనంగా ప్రతి రోజు నిర్వహించడం జరుగుతుంది. దేవి నవరాత్రుల్లో భాగంగానే గ్రామ ప్రజలందరూ దుర్గామాత దేవి దర్శనం చేసుకోవడం జరిగింది. వందలాదిమంది భక్తులతో ఆలయ ప్రాంగణం పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతూ జన సందోహంతో ఆనంద ఉత్సవాలతో సంబరాలు నిర్వహించడం జరిగింది. గుడెపు శివారెడ్డి, గుండ వెంకటస్వామి మాట్లాడుతూ నిత్య జీవితంలో ఎన్నో కష్టాలు మనల్ని వేటాడుతూ భయకంపితుల్ని చేస్తుంటాయి. దుఃఖ సంద్రంలో ముంచేత్తే మానసిక ఒత్తిళ్లకు గురి చేస్తుంటాయి. దరిద్రం తాండవిస్తూ మనల్ని నిరాశవాదమనే ఊబిలో నెట్టేస్తుంటాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒకసారి అమ్మ నామాన్ని స్మరించడం, అమ్మ గుణాల్ని కీర్తించడం, అమ్మ రూపాని దర్శించడం, వల్ల ఎనలేని కష్టాలు అంతులేని అవంతరాలు అంతరించి పోతాయని మన దుఃఖాలు, దరిద్రం భయం, పోయేందుకు దుర్గామాత దేవుని స్తుతించాలని దేవి మహత్యం సూచిస్తుంది. అని దేవాలయ కమిటీ సభ్యులు గుండా వెంకటస్వామి అన్నారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు, యువతి యువకులు, ఆటపాటలతో, బొడ్డెమ్మలతో, కోలాటాలతో, డ్యాన్సులతో గ్రామ ప్రజలను ఆలరించి ఎంతగానో ఆనందోత్సవంలో వందలాదిమంది గ్రామ ప్రజలు ఆనందోత్సవంలో గడిపారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333