బి ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా ...
మునగాల 08 మే 2024
తెలంగాణ వార్తా ప్రతినిధి :-
మునగాల మండల పరిధిలోని బరాగతి గూడెం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామ మాజీ సర్పంచ్ ఏనుగుల కృష్ణవేణి - నాగేశ్వరరావు, బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గోదాటి వెంకటయ్య లు బి ఆర్ ఎస్ పార్టీకి, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఏనుగుల నాగేశ్వరరావు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ లో ఉండి బరాకతి గూడెం , గ్రామాభివృద్ధికి తనవంతు కృషిచేయలేక పోతున్నానని బిఆర్ఎస్ మండల నాయకులు ఏనుగుల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మండల పరిధిలోని బరాఖత్ గూడెం గ్రామంలో తననివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లారు. తాము బిఆర్ఎన్ పార్టీలో ఉండి గ్రామాభివృద్ధికి పాటుపడ లేకపోయామని, గ్రామంలో విద్యుత్ సమస్య అధికంగా ఉండటంతో సబ్ స్టేషన్ నిర్మాణం కోసం మంత్రికి కి పలుమార్లు విన్నవించినా ఏమీ చేయలేకపోయాడని, స్థానిక ఎమ్మెల్యే ద్వారా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఆలోసించారు. తాను, గ్రామశాఖ అధ్యక్షులు గోదాటి వెంకటయ్య బిఆర్ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీమానా చేస్తున్నట్లు తెలిపారు. ఏ పార్టీలో చేరాలనేది తమ అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలుపుతున్నలు తెలిపారు. ఆయన వెంట గోదాటి వెంకటయ్య తదితరులున్నారు. ఆ కారణంగానే పార్టీకి రాజీనామా చేస్తున్నామని, ఏ పార్టీలో చేరదామనేది భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని ఆయన అన్నారు.