నీళ్లు,నిధుల కోసమే "తెలంగాణను" కోట్లాడి తెచ్చుకుంది
నీళ్లు,నిధుల కోసమే "తెలంగాణను" కోట్లాడి తెచ్చుకుంది
*ములుగు నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జి బడే నాగజ్యోతి*
????రేవంత్ రెడ్డి దేవాదుల పర్యటనతో స్థానిక ప్రజలకు ఎలాంటి లాభం లేదు
???? పర్యటనల పేరుతో ప్రజాధనం వృధా చేయడం సరికాదు
????రేవంత్ రెడ్డి సీఎం హోదాలో మూడుసార్లు "దేవాదాల ప్రాజెక్టు" ను సందర్శించిన అభివృద్ధి శూన్యం
???? కెసిఆర్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందింది
???? కెసిఆర్ ను విమర్శించే అర్హత రేవంత్ రెడ్డికి లేదు
???? రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పటం ఖాయం
బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నే ములుగు జిల్లా అభివృద్ధి చెందింది
???? ఏజెన్సీలోని" ఐదు" మండలాలను మంత్రి సీతక్క పట్టించుకోకపోవటం సరికాదు
???? సీతక్కకు పంచాయతీరాజ్ శాఖ కన్నా పర్యటక శాఖ కేటాయిస్తే బాగుంటుంది
????ములుగు జిల్లా ప్రజలు సీతక్క కపట ప్రేమ ను గమనిస్తూనే ఉన్నారు
???? ప్రజా సంక్షేమ ధ్యేయంగా ముందుకు సాగుతా
???? బి.ఆర్.ఎస్ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి ????????
నీళ్లు, నిధుల కోసమే" తెలంగాణను" కొట్లాడి తెచ్చుకుందని బి.ఆర్. ఎస్ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్టును సందర్శించిన సందర్భంలో "నాగజ్యోతి "సోమవారం మీడియా కు ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాదుల పర్యటన నేపథ్యంలో స్థానిక ప్రజలకు ఎలాంటి లాభం లేదని అర్థమైందని అన్నారు. పర్యటనల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేయడమే తప్ప స్థానిక ప్రజలకు ఎలాంటి లాభం జరగడంలేదని అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఇప్పటికే మూడుసార్లు దేవాదుల ప్రాజెక్టును సందర్శించారని, అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధి కల్పించడం లేదని ఆమె ఆరోపించారు. కెసిఆర్ హయాంలోనే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందని అన్నారు. ముఖ్యంగా ములుగు ప్రాంత అభివృద్ధి కోసం కేసీఆర్ ములుగును జిల్లా చేయడంతో పాటు గ్రామాల అభివృద్ధి కోసం అనేక నిధులు విడుదల చేసి ఈ ప్రాంతా అభివృద్ధికి కృషి చేశాడని ఆమె పేర్కొన్నారు. అలాంటి కెసిఆర్ ను విమర్శించే అర్హత కూడా రేవంత్ రెడ్డికి లేదని నాగజ్యోతి ఉన్నారు. దేవాదుల ప్రాజెక్టును మూడుసార్లు సందర్శించిన రేవంత్ రెడ్డి ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏమిటో బహిరంగ చర్చకు రావాలని ఆమె సవాల్ విసిరారు. ములుగు ఏజెన్సీ ప్రాంతంలోని ఏటునాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం మండలాలను స్థానిక మంత్రి సీతక్క ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. టిఆర్ఎస్ హయాంలోనే ఆయా మండలాల్లో అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుంచి నేటి వరకు సీతక్క ఆ ఐదు మండలాల్లో ఎలాంటి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయలేదని ఆరోపించారు. మంత్రి సీతక్కకు పంచాయతీరాజ్ శాఖ కన్నా పర్యాటకశాఖ కేటాయిస్తే బాగుంటుందని నాగజ్యోతి ఏద్దేవా చేశారు. ములుగు జిల్లా ప్రజల పట్ల సీతక్క కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని, అది ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఆమె అన్నారు. రేవంత్ రెడ్డి దేవాదుల పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క కలుగజేసుకొని ఏజెన్సీలోని ఐదు మండలాలకు మనం ఎలాంటి సహాయ, సహకారాలు అందించలేదని సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేయటాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతానని, కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళ్తానని ఆమె పేర్కొన్నారు.
????ఆ మండలాలకు సాగునీరు అందించాలి
గంగారం, కొత్తగూడెం మండలాలకు పాకాల లో లిఫ్ట్ ఏర్పాటు చేసి సాగునీటిని అందించాలని నాగజ్యోతి డిమాండ్ చేశారు. గంగారం,కొత్తగూడ మండలాల్లో సాగునీటి కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రామప్ప చెరువులో ఎలాగైతే దేవాదుల నీటిని లిఫ్ట్ ద్వారా విడుదల చేస్తున్నారో... అలాగే మరో లిఫ్ట్ పాకాల లో ఏర్పాటు చేసి గంగారం, కొత్తగూడ మండలాలకు సాగు నీటిని అందించాలని ఆమె డిమాండ్ చేశారు.అలాగే ఏటూరునాగారం, మంగపేట, తాడువాయి మండలాలకు కన్నాయిగూడెము మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్ నుంచి కాలువల ద్వారా సాగునీటిని అందించాలని ఆమె డిమాండ్ చేశారు. కాల్వ ద్వారా సాగునీటి అందించడం వీలుకాకుంటే లిఫ్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా రైతులకు సాగు నీటిని అందించాలని అన్నారు.
???? కమిషన్ల కోసమే తుపాకుల గూడెం బ్యారేజ్ అంచనాలు పెంపు
కాంగ్రెస్ ప్రభుత్వం స్వార్ధ రాజకీయాలను అవలంబిస్తుందని నాగజ్యోతి అన్నారు. రూ. 6,000 వేల కోట్లతో ప్రారంభించిన దేవాదుల ప్రాజెక్టు పనుల్లో కమిషన్ల కోసమే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.18,500 వేల కోట్లకు అంచనా విలువను పెంచడం జరిగిందని ఆమె ఆరోపించారు. సమ్మక్క బ్యారేజ్ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు,రైతులకు త్రాగునీరు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సానికొమ్ము రమేష్ రెడ్డి, కుడుములు లక్ష్మీనారాయణ, లకవత్ నరసింహనాయక్,ఎట్టి జగదీష్,పట్టణ అధ్యక్షులు చెన్న విజయ్, ఆకుతోట చంద్రమౌళి, మాజీ జడ్పీటీసీ రామసహాయం శ్రీనివాస్ రెడ్డి, యూత్ జిల్లా అధ్యక్షులు కోగిల మహేష్, కౌన్సిలర్లు బైకని సునీత, ఓదెలు, గోనెల భారత్, కోగిల లక్మీ, బైకని అనూష సాగర్, మాజీ ఎంపీటీసీలు గొర్రె సమ్మయ్య, పోరిక విజయరాం నాయక్,మాచర్ల ప్రభాకర్, అజ్మీరా చందూలాల్, అనుముల సురేష్,మాజీ సర్పంచ్ గండి కుమార్, సర్పంచులు బానోతు సీతారాం, ఉప సర్పంచ్ అన్న తిరుపతి, పార్టీ నాయకులు కాకి పురుషోత్తం,గరిగ రఘు, ముంజల బిక్షపతి, చెదర సంతోష్, చల్లగురువుల తిరుపతి,రవిరమన్న,BRS ములుగు జిల్లా నాయకులు కొమరం సిద్దు, తదితరులు పాల్గొన్నారు