ఎన్నికల నిబంధనలు పాటించాలి

Sep 30, 2025 - 20:22
 0  5

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఎన్నికల నిబంధనలు పాటించాలి ఆత్మకూర్ ఎస్. స్థానిక సంస్థల ఎన్నికలలో ఎన్నికల కమీషన్ సూచనల పై మండల పరిషత్ కార్యాలయంలోఎంపీడీవో హసీం, తహసిల్దార్ అమీన్ సింగ్, ఎస్ఐ శ్రీకాoత్ గౌడ్ మంగళవారం పంచాయతీ కార్యదర్శుల కు అవగాహన కల్పించారు. గ్రామాల్లో ఎన్నికల నిబంధన ప్రకారం గోడలపై పార్టీలకు సంబంధించిన రాసిన రాతలను ప్రచారాలను, తొలగించాలని వారు తెలిపారు. జెండాలు, పార్టీల దిమ్మెలు, నాయకులు నేతల విగ్రహాలకు ముసుగులు వేయాలని తెలిపారు. గ్రామాల్లో మద్యం బెల్ట్ షాపులు మూసివేయాలని బహిరంగ ప్రదేశాల్లో మధ్య సేవించిన నలుగురు కంటే మించి కగుమికూడినా చట్టపరమైన చర్యలు ఉంటామని ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శులు జిపిఓలు పాల్గొన్నారు.