ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

మరిపెడ 29 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని 3వ వార్డులో మహిళలు సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ ప్రకారం బతుకమ్మ గీతాల నడుమ రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను పేర్చుకొని మహిళలు ఆనందోత్సాహాలతో .ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మ చుట్టూ నృత్యాలు చేస్తూ...పండుగ వాతావరణం మరిపెడ మున్సిపల్ కేంద్రాన్ని సందడిగా మార్చింది.ఈ కార్యక్రమంలో అనంతగిరి విజయ. జమ్ముల సుస్మిత. అనంతగిరి హరిత. తిమ్మిడి మానస. గంగుల పల్లవి. గంగుల తులసి గంగుల మల్లమ్మ అనంతగిరి ప్రమీల. అనంతగిరి కీర్తన. అనంతగిరి లిప్సి.తదితరులు పాల్గొన్నారు.