జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

Aug 27, 2025 - 18:58
 0  3
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రజలకు, అధికారులకు సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్.,.

జోగుళాంబ గద్వాల 27 ఆగస్టు 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల్ పోలీస్ కార్యాలయంలో వినాయ‌క చ‌వితి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు.  ఈ కార్యాలయం లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద జిల్లా  ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు దంపతులు, పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకొన్నారు. 


    ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ........ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని, అందరు తాము మొదలు పెట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి అయ్యేటట్లు చూడాలని, కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని, మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా జిల్లా పరిధిలోని ప్రజలలో ఉన్న సోదరభావం, ఐక్యత ఎంతో సంతోషాన్ని కలిస్తుందని, పోలీసు శాఖ సూచించిన మేరకు ఆయా మండపాల వద్ద నిర్వాహకులు, యువత పోలీస్ వారి సూచనల ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ఇదేరీతిలో ఈరోజు నుండి నిమజ్జనం రోజు వరకు ప్రతి ఒక్కరు పోలీస్ వారికి సహకరించాలని ఎటువంటి ఆటంకాలు లేకుండా నవరాత్రులు, నిమజ్జన శోభయాత్ర నిర్వహించుకోవాలని ప్రజలకు ఎస్పీ  తెలిపారు.

   ఇట్టి పూజ కార్యక్రమంలో డీ.ఎస్.పి వై. మొగిలయ్య, ఏ.వో. సతీష్ కుమార్, ఆర్.ఐ.వెంకటేశ్, అలంపూర్ సి.ఐ. రవిబాబు, గద్వాల్ టౌన్ యస్.ఐ. కల్యాణ్, గద్వాల్ రూరల్ ఎస్.ఐ. శ్రీకాంత్, ఆర్.ఎస్. ఐ. లు విజయభాస్కర్, చంద్రకాంత్, ట్రాఫిక్ ఆర్. ఎస్. ఐ. బాలచంద్రుడు, మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333