ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
తిరుమలగిరి 09 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని తిరుమలగిరి పట్టణ మండల కేంద్రంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా నాయకులు అధికార ప్రతినిధి సంకపల్లి కొండల్ రెడ్డి, తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్సోజు నవీన్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ప్రజాస్వామ్య విలువలను పునరుద్ధరించిన ప్రజా సంక్షేమం పట్ల అంకితభావంతో కృషి చేస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు.ఆయన నాయకత్వం రాష్ట్రం పలు అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సమానత్వం, సంక్షేమం, పారదర్శకతతో కూడిన ప్రజా ప్రభుత్వంగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం సంక్షేమ ఫలాలను పొందేలా పథకాలు రూపొందించడం సీఎం రేవంత్ దూరదృష్టికి నిదర్శనం అని తెలిపారు. పేదల బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి, ఇందిరమ్మ ఇండ్ల పథకం పునరుద్ధరించడం, రైతులకు సాగునీటి హామీతో పాటు రైతు రుణమాఫీ అమలుపరచడం, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యా హక్కు చట్టం అమలుపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు బత్తుల శ్రీనివాస్, కో-ఆపరేటివ్ డైరెక్టర్ బానోతు కిస్ట్టు నాయక్, చింతకాయల సుధాకర్, హీరు నాయక్, బిసి సెల్ అధ్యక్షులు కన్నెబోయిన మల్లయ్య, గిలగత్తుల రాము గౌడ్, సంత్ సేవాలాల్ మహారాజ్ కమిటీ అధ్యక్షులు రాములు నాయక్, వనగండ్ల సాయి, గాదరబోయిన లింగయ్య, జంపాల బిక్షం, రవి నాయక్, యాదగిరి, ఉపేందర్, సంపత్, మెతుకు నరసింహ, డి నరసింహ,మాసంపల్లి మోహన్, రమేష్, కుమార్, తదితరులు పాల్గొన్నారు.