రాజీమార్గం రాజా మార్గం ఎస్సై వెంకటేశ్వర్లు
తిరుమలగిరి 09 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
శత్రువులను పెంచుకుంటూ వెళ్తే శత్రుత్వమే పెరుగుతుందని రాజీ పడితే.. ఇద్దరూ గెలిచినట్టేనని రాజీమార్గమే రాజ మార్గమని తిరుమలగిరి ఎస్సై సిహెచ్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వివిధ కేసులతో కోర్టు చుట్టూ తిరుగుతున్న వారు ఈనెల 15 న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలీస్ కేసులకు సంబంధించి యాక్సిడెంట్, గొడవ, చీటింగ్, భూతగాదాలు వివాహ సంబంధానికి సంబంధించిన కేసులపై రాజీ పడదగిన కేసులపై రాజీపడి కేసులను క్లోజ్ చేసుకోవాలన్నారు...