ప్రజల జీవితాల్లో ఈ దీపావళి వెలుగులు నింపాలి 

Oct 30, 2024 - 14:43
 0  38
ప్రజల జీవితాల్లో ఈ దీపావళి వెలుగులు నింపాలి 

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు 
తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్

(సూర్యాపేట టౌన్ అక్టోబర్ 30 ) 

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం స్థానికంగా ఆయన తెలంగాణ ప్రజలకు దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం మాట్లాడారు. చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ పర్వదిన వేడుకను ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల నడుమ జరుపుకోవాలని కోరారు. ప్రధానంగా భారతదేశంలో జరుపుకునే అతిపెద్ద గొప్ప పండుగలో ఒకటని చెప్పారు. దీపావళి ఆనందం విజయంతో పాటు సామ్రాస్యాన్ని గుర్తు చేసే పండుగ అని అభివర్ణించారు. హిందూ పురాణాల ప్రకారం నాడు 14 సంవత్సరాల ప్రవాసం తర్వాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడనే విశ్వాసం ప్రజల్లో ఉందన్నారు. ఈ ప్రవాస కాలంలో అతను రాక్షసుల తోను లంక యొక్క శక్తివంత పాలకుడైన రావణ రాజుతో పోరాడాడాని తెలిపారు. తిరిగి రాముడు వచ్చినప్పుడు, ఆ అయోధ్య ప్రజలు ఆయనను స్వాగతించారని, అతని విజయాన్ని జరుపుకోవడానికి ప్రతీకగా దీపాలు వెలిగించారనేది చరిత్ర చెబుతుందని స్పష్టం చేశారు. అప్పటినుండి చెడుపై మంచి విజయాన్ని ప్రకటించడాన్ని దీపావళి పండుగను జరుపుకుంటారని పేర్కొన్నారు. దీపాల కాంతుల వలె తెలంగాణలోనూ ప్రతి ఇంటా వెలుగులు నిండాలని ఆకాంక్షించారు.  మనలో అజ్ఞాన అంధకారాన్ని తొలగించి చైతన్యాన్ని రగిలించి బంగారు తెలంగాణ సాధనలో నూతన ఉత్తేజంతో ముందడుగు వేయాలన్నారు.  అలాగే బానసంచ పేల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ రియల్ ఎస్టేట్ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ జిల్లా గౌరవ సలహాదరుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్య గౌడ్ సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్ పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి పట్టణ ఉపాధ్యక్షుడు ఖమ్మం పాటి అంజయ్య గౌడ్ పట్టణ కార్యదర్శి భానోతు జానీ నాయక్ జిల్లా ఉపాధ్యక్షుడు మండాది గోవర్ధన్ నిలయ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333