ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమేళనం*
*ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమేళనం*
పెన్ పహాడ్ తెలంగాణ వార్త మార్చి 10 పెన్ పహాడ్ మండల పరిధిలోని అనంతారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-2003 సంవత్సరం పదవ తరగతి చదివిన విద్యార్థినీ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థులు దాదాపు 22 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాడు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను, జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని సంతోషంగా గడిపారు. ఇక్కడ చదవిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డారు. నాడు తమకు విద్యాబుద్దులు నేర్పిన గురువులను సాదరంగా ఆహ్వానించి విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు శాలువా మెమోంటో లతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాద్యాయులు మాట్లాడుతూ 22 సంవత్సరాల తరువాత తమను పిలించి ఇంతటి తీపి జ్ఞాపకాలను తిరిగి ఆస్వాదించేలా చేయడం, ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో ఉండడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు బైరెడ్డి ప్రతాపరెడ్డి .పూర్ణచారి. బిక్షం నర్సారాజు. నారాయణ.మామిడి అంజయ్య. దంతాల శ్రీనివాస్. షరీఫ్.శ్రీనువాస్. పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు