ప్రమాద బాధితులకు ఆర్ధిక సహాయం అందాజేత
మునగాల 10 మార్చి 2024
తెలంగాణ వార్త ప్రతినిధి:-
... గత నెల 28న తేదీన మోతె మండలంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గాయాలపాలైన విజయ రాఘవపురం. రేపాల గ్రామాలకు చెందిన వారి కుటుంబీకులకు. ఆదివారం మండల పరిధిలోని విజయరామపురం గ్రామంలో గల గ్రామీణ ఉద్యోగుల సమాఖ్య కార్యాలయంలో ఆర్థిక సాయం అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్రాంత కలనల్ గ్రామీణ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు సుంకర శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సంఘ సభ్యుల నుంచి సేకరించిన లక్ష 26 వేల రూపాయల విరాళాలను బాధిత కుటుంబ సభ్యులకు అందజేసినట్లు తెలిపారు. తమ సంఘం ఆధ్వర్యంలో తమ వంతు సహాయ సహకారాలు అందజేసినట్లు తెలిపారు. తమను ఆదర్శంగా తీసుకొని పలువురు దాతలు ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వం త్వరగా మృతి చెందిన వారికి గాయాలైన వారికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని అదేవిధంగా శత గాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కోరుతున్నట్లు తెలిపారు. తొలుత మృతి చెందిన వారికి సంతాపంగా మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు గుండు నరసయ్య. ఆర్థిక కార్యదర్శి దయాకర్. పోతురాజు నరసయ్య. సీనియర్ నాయకులు సుంకర పిచ్చయ్య. బాధిత కుటుంబం సభ్యులు గ్రామస్తులు .సమైక్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు