గుడ్ ఫ్రైడే , ఈస్టర్ సందర్భంగా ఖమ్మం క్రైస్తవుల ఆధ్వర్యంలో జయహో...
యేసు నిజముగా లేచియున్నాడు రన్ ఫర్ జీసస్ క్రైస్తవుల ర్యాలీ
ఖమ్మం : రన్ ఫర్ జీసస్ క్రైస్తవుల ర్యాలీని శనివారం ఉదయం ఏడు గంటలకు ఎన్టీఆర్ సర్కిల్ నుండీ కొత్త బస్ స్టాండ్ , బైపాస్ రోడ్డు , డి.ఆర్.డి.ఏ మరియు బస్ డిపో ఎదుట నుండి పెవిలియన్ గ్రౌండ్ వరకు జయహో... యేసు నిజముగా లేచియున్నాడు , క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియై యున్నాడు , ఇదిగో లోకపాపములను మోసుకొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల...దేవుడు లోకమును ఎంతో ప్రేమించునని , యేసు చెప్పెను నేనే....... సత్యమును... జీవమును...మార్గమును , మనమింకను పాపులమైయుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయేను అని నినాదాలు చేసుకుంటూ సుమారు 2000 మందితో ఘనంగా ఈ ర్యాలీని నిర్వహించారు . కన్వీనర్ చల్లగుండ్ల రమేష్ బాబు అధ్యక్షత వహించగా బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తుంపాల కృష్ణ మోహన్ , సి.ఎస్.ఐ పీస్ కమిటి చైర్మన్ పల్లా రాజశేఖర్ మరియు క్రైస్తవ పెద్దలు ఏర్పుల ప్రభాకర్ లు జెండా ఊపి ప్రారంభించరు . ఈ కార్యక్రమంలో మహసేన జిల్లా అధ్యక్షులు మందా సంజీవ రావు , ఐక్య వేదిక అధ్యక్షులు తిమోతి , బిషప్ జాన్ కాంతారావు , వేముల సత్యం , జాకోబ్ జాన్ , ఎన్. బాలస్వామి , కే .బాబురావు , అభిషేక్ ,రవికిరణ్ , బి.పాల్ , జగన్ , ఐజెక్ , సంజీవరావు , పాల్ , అదాం మరియు ఖమ్మం పట్టణంలో వున్న అన్నీ సంఘాల క్రైస్తవ నాయకులైన పెద్దలు , తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు .