గణనాథుని దర్శించుకున్న మాజీ సర్పంచ్ మామిళ్ళపల్లి చక్రవర్తి

14-09-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం .
చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గుడెం గ్రామంలో విఘ్నేశ్వరుని సేవలో పాల్గొన్న మాజీ సర్పంచ్ మామిళ్ళపల్లి చక్రవర్తి.
ఈరోజు చిన్నంబావి మండలం గుడెం గ్రామంలో గ్రంథాలయం దగ్గర ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని గ్రామ ప్రజలతో కలిసి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు అందుకున్న గూడెం గ్రామ మాజీ సర్పంచ్ మామిళ్ళపల్లి చక్రవర్తి.
అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటు, అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భోజనం తాంబూలాలను స్వీకరించాడు.
ఈ యొక్క కార్యక్రమంలో మామిళ్ళపల్లి చక్రవర్తి తో పాటు షేర్ పల్లి వెంకటస్వామి, చిన్న కురుమయ్య, మహిళా సంఘం ఆడపడుచులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పూజా కార్యక్రమానికి హాజరైనందువలన మాజీ సర్పంచ్ మామిళ్ళపల్లి చక్రవర్తికి యువకులు అభినందనలు తెలియజేశారు.