సాగర్ ఎడమ కాలువ ద్వారా విడుదల చేసే నీటితో చెవులు కాలువలు నిపలి.......సామాజిక కార్యకర్త గంధం సైదులు

Apr 3, 2024 - 10:40
 0  5
సాగర్ ఎడమ కాలువ ద్వారా విడుదల చేసే నీటితో చెవులు కాలువలు నిపలి.......సామాజిక కార్యకర్త గంధం సైదులు
తహసిల్దార్ కి వినతిపత్రం అందజేస్తున్న సామాజిక కార్యకర్త గంధం సైదులు

మునగాల 03 ఏప్రిల్ 2024

తెలంగాణ వార్తా ప్రతినిధి :-

మునగాల మండల తహశీల్దార్ ఆంజనేయులు కి సామాజిక కార్యకర్త గంధం సైదులు , ఎడమ కాలువ ద్వారా విడుదల చేసిన నీటితో చెరువులు బావులు నిపాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల వల్ల గ్రామాలలో బావులు చెరువులు కుంటలు ఎండిపోయి బోర్లలో భూగర్భ జలాలు అట్టడుగు చేరాలని దీని ద్వారా ప్రజలు నీటి సమస్యల తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వ ఎట్టకేలకు ప్రజల సమస్యలను గుర్తించి తాగునీటి సమస్యలను తీర్చేందుకు సాగర్ ఎడమ కాలవ ద్వారా నీటిని విడుదల చేసినారు కావున గ్రామాలలో ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులు బావులు, కుంటలను నింపి తాగునీటి సమస్యను తీర్చాలని మునగాల మండల తాసిల్దార్ కోరటం జరిగినదని. ఈ కార్యక్రమం లో ,నాయకులు ఉప్పుల యుగంధర్ రెడ్డి , దేవినేని కొరివి వీరభద్ర రావు ,పాల్గొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State