పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన సంకినేని వెంకటేశ్వరరావు

Jun 5, 2025 - 20:03
Jun 6, 2025 - 19:03
 0  18
పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన సంకినేని వెంకటేశ్వరరావు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ :  పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన సంకినేని వెంకటేశ్వరరావు* *ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆత్మకూర్(S) మండలంలోని గట్టికల్ గ్రామంలో నాయకులతో కలిసి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు గారు మొక్కలు నాటారు... ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలు నాటడం మరియు వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని.. వాతావరణ సమతుల్యం దెబ్బతినకుండా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు... పర్యావరణ రక్షణకు వర్షాలు సమృద్ధిగా కురవడానికి వృక్షాలు, అడవులు దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కు బదులుగా చేతి సంచులు వాడాలని తెలిపారు...* *ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సంద్యాల సైదులు, జిల్లా కౌన్సిల్ సభ్యులు పందిరి రామ్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు పాటీ కరుణాకర్ రెడ్డి, తుడి సారయ్య, మండల ఉపాధ్యక్షులు బానోత్ బిక్కు నాయక్, చందా కృష్ణమూర్తి, సకినాల వెంకన్న, మండల నాయకులు గుంటూరు వీరస్వామి, యువ మోర్చా మండల అధ్యక్షులు గోపగాని భాను ప్రకాష్, దళిత మోర్చా మండల అధ్యక్షులు ఆరెంపుల వంశీ, గ్రామ నాయకులు భయ్యా లింగయ్య, మోరపాక లింగయ్య, బాల్తి కోటేశ్వరరావు, కోన చక్రి మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు*