విద్యార్థుల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించే వృత్తి... ఉపాధ్యాయ వృత్తి - సరితమ్మ
- ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న...
- మాజీ జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ...
జోగులాంబ గద్వాల 13 జూలై 2024 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల. నియోజకవర్గం మల్దకల్ మండలం అమరావాయి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదోన్నతులు పొందిన,బదిలీపై వెలుతున్న ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో సరితమ్మ ముఖ్య అతిధులుగా హాజరైన్నారు... బదిలీపై వేరే పాఠశాలకు వెలుతున్న ఉపాధ్యాయులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతూ మరియు స్వాగత సన్మాన కార్యక్రమంలో మాజీ జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేష్, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులను శాలువా, పూలమాలలతో సన్మానించారు... అనంతరం ఇంచార్జీ సరితమ్మ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ సహజమేనని,పని చేసిన చోట మంచి పేరు సంపాదించుకోవాలన్నారు...విద్యార్థుల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించి వారి బంగారు భవిష్యత్ కు బాటలు వేసిన ఉపాధ్యాయులు పాఠశాలను వీడి బదిలీపై వెలుతున్న సందర్భంగా వారికిదే ఆత్మీయ వీడ్కోలు పలకడం జరుగుతుందని సరితమ్మ అన్నారు.....
ఈ కార్యక్రమంలో ధరూర్ మండల మాజీ జెడ్పిటిసి పద్మ వెంకటేశ్వర రెడ్డి,మాజీ ఎంపిటిసి అలివేలమ్మ అమరావాయి కృష్ణారెడ్డి,జెడ్పి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు నరేష్,మాజీ సర్పంచ్ పద్మమ్మ, ధోని ఆంజనేయులు, కుర్వ శ్రీనివాసులు,తిమ్మయ్య,లక్షణ్,గోపాల్ రెడ్డి, సాగర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు..