గేదెలకు పశువులకు గాలి సోకకుండా ఉచిత టీకాలు జిల్లా పశువైద్యాధికారి కృష్ణ
అడ్డగూడూరు 06 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరదిలోని జానకిపురం గ్రామంలో జిల్లా పశుగణాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రోజు పశుసంవర్ధక శాఖ సహకారంతో "ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం"నిర్వహించడం జరిగింది.ఈ శిబిరాన్ని జిల్లా పశువైద్యాధికారి కృష్ణ, ప్రత్యేక అతిధులుగా విచ్చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో 32 ఎదకు రానివి 21ఎదకు వచ్చిన గర్భం దాల్చని పశువులకు నిపుణులైన పశు వైద్యులచే పరీక్షించి చికిత్స చేయడం జరిగింది.122 పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయడం జరిగింది.ఎదలో ఉన్న వాటికి కృత్రిమ గర్భధారణ చేశారు.అదేవిధంగా చూడి పరీక్షలు చేయడం జరిగింది.దూడలకు నట్టల నివారణ మందులు వేయడం జరిగింది.రైతులకు కృత్రిమ గర్భధారణ మరియు మేలు జాతి పాడి పశువుల పై అవగాహన కల్పించడం జరిగింది.అదేవిధంగా విటమిన్ ఇంజక్షన్లు ఇవ్వడం జరిగింది, పాల దిగుబడిని పెంచే ఖనిజ లవణ మిశ్రమాలను పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అడ్డగూడూరు విఏఎస్ అనిల్ రెడ్డి,ఎల్ వో శ్రీరాములు,విఏ ఈశ్వరయ్య, గోపాలమిత్ర సూపర్వైజర్ మర్రి మహేష్,గోపాల మిత్రు కొమురయ్య, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.