మైనర్ బాలిక కేసులో నిందితుడైన బండ్ల రాజశేఖర్ రెడ్డి
ముందస్తు బెయిల్ డిస్మిస్ చేసిన హైకోర్ట్ బెంచి న్యాయమూర్తి కి ప్రత్యేక ధన్యవాదాలు
జోగుళాంబ గద్వాల్ జిల్లా RSP టీం నాయకులు బండారి సునంద్ రఫీ
జోగుళాంబ గద్వాల్ 6 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల్. జిల్లా మల్దకల్ మండలం బిజ్జారం గ్రామంలో మైనర్ బాలిక రాజేశ్వరి మృతికి కారకుడైన ప్రధాన ముద్దయి గా ఉన్న బండ్ల రాజశేఖర్ రెడ్డి ముందస్తు బెయిల్ డిస్మిస్ చేసినా హై కోర్ట్ బెంచి న్యాయమూర్తి రాధ రాణి కి ప్రత్యేక ధన్యవాదాలు అని బండారి సునంద్ రఫీ లు హర్షం వ్యక్తం చేసారు.
చివరికి న్యాయమే గెలిచింది, పెదోళ్ళకి అండ గా అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు బెంచి న్యాయమూర్తులు పేదోళ్లపక్షమే ఉండి ,ఈరోజు ముందస్తు బెయిల్ డిస్మిస్ చేసినందుకు న్యాయం గెలిచిందని అన్నారు.
ఈరోజు దేశంలో ఉన్న మహిళా లకు రక్షణగా న్యాయస్థానం అండగా ఉంధి అని మరోసారి ఋజువు అయ్యిందీ.
కాబట్టీ వేంటనే రాజేశ్వరి మృతికి కారణమైన బండ్ల రాజశేఖర్ రెడ్డి నీ వేంటనే అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.