గంజాయి త్రాగుతూ పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు రిమాండ్

Aug 7, 2025 - 20:55
 0  3
గంజాయి త్రాగుతూ పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు రిమాండ్

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ గంజాయి త్రాగుతూ పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు కేసు నమోదు, రిమాండ్ .. ఆత్మకూర్ ఎస్... మండల పరిధిలోని ఎనుబాముల స్టేజి సమీపంలో గుట్ట వద్ద ఇద్దరు వ్యక్తులు గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడిన సంఘటన గురువారం పోలీసులు తెలిపి వివరాలు ప్రకారం పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ సిబ్బందికి ఏనుభముల  స్టేజి సమీపంలోని గుట్ట వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు విచారించారు.ఉదయం 09.15 గంటలకు పెట్రోలింగ్ గురించి వెళ్ళుటకు సిబ్బంది ని తీసుకొని పోలీస్ స్టేషన్ నుండి బయలుదేరి పెట్రోలింగ్ చేస్తూ ఏనుబాముల గ్రామానికి వెల్లుచుండగా గట్టికల్ గ్రామానికి చెందిన మడ్డి అయోద్య, నెమ్మికల్ కు చెందిన పాతులోతు రిత్విక్ రాథోడ్ కలసి గంజాయి తాగుతున్నట్లు తెలిపారు. వారి వద్ద దొరికిన 180 గ్రాముల గంజాయినివారి బైక్ మరియు రెండు సెల్ ఫోన్లను సీజ్ చేసి, గంజాయిని పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను పోలీస్ స్టేషన్ కు తీసుకొనివెళ్లినట్లు తెలిపారు. పట్టుబడిన వారిలో అయోధ్య హైదరాబాదులో ఆటో నడుపుతున్నాడనీ రిత్విక్ చదువుకుంటున్నట్లు తెలిపారు. ఎంజాయ్ చేయిస్తున్న అయోధ్య ఎత్తుకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.సమాచారం తెలుసుకున్న సూర్యాపేట డి.ఎస్.పి ప్రసన్న కుమార్ ఆత్మకూరు ఎస్ పోలీసు స్టేషన్ వచ్చి విలేకరుల సమావేశం నిర్వహించారు. నిందితులను రిమాండు కు పంపు తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యంగా విద్యార్థులు చక్కగా చదువుకోవాలి, ఇలాంటి దుర్వ్యసనాలకు అలవాటు తమ చక్కటి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అని సూచించారు. ఎవరైనా మండల పరిధిలో గంజాయిని త్రాగినా, అమ్మినా వారి పై చట్ట పరమైన చర్య తీసుకోనున్నట్లు తెలిపారు.