మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు

Aug 7, 2025 - 20:57
 0  4
మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.పాఠశాలలో విద్యార్థినులతో విద్యార్థులందరికీ రాఖీ కట్టించి రక్షాబంధన్ విలువను తెలియజేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ విద్యార్థులందరూ సోదరా భావంతో ఉండాలని అన్నారు జీవితంలో స్థిరపడాలంటే క్రమశిక్షణ అంకితభావంతో చదువుకోవాలని తెలియజేశారు. విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భూతం యాకమల్లు శ్రీను సుధాకర్ కరుణాకర్ తిరుమలేష్ కృష్ణయ్య బాబు రంగారెడ్డి సంతోష్ రుక్మిణి స్వప్న పాల్గొన్నారు