పిల్లల్ల విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి పరీక్షల దోహదపడతాయి...... ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి
మునగాల 19 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి :- మునగాల మండల కేంద్రంలో గల సాయి గాయత్రి విద్యాలయలో ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు విద్యార్థినీ విద్యార్థులకు అబాకస్ పై నిర్వహించిన పరీక్షలలో అత్యధిక మార్పులు సాధించిన వారికి షీల్డ్ మరియు మెడల్స్ స్థానిక ఏ ఎస్ ఐ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా బహూకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అరవపల్లి శంకర్ పాఠశాల చైర్మన్ అరవపల్లి ఉషారాణి , ఏవో ఆర్ ప్రభాకర్ రెడ్డి , పాల్గొన్నారు . విద్యార్థిని విద్యార్థులు సాధించిన మార్కులఆధారంగా మెడల్స్ బహూకరించారు
అదేవిధంగా అబాకస్ పై నిర్వహించిన పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన అన్ని తరగతుల వారికి మెడల్స్ బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ చిన్నతనం నుండే ఇలాంటి పరీక్షలలో నైపుణ్యం సంపాదించి తద్వారా అందరూ ఉన్నత స్థితికి చేరాలని ఇలాంటి పరీక్షలు నిర్వహించి బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని కొనియాడారు ఇలాంటి అనుభవం కలిగిన ఉపాధ్యాయ బృందం కలిగిన పాఠశాలలో పిల్లలు చదవడం అదృష్టంగా భావించాలని ఆయన విద్యార్థిని విద్యార్థులకు తన ఆశీస్సులను అందిస్తూ తెలియజేశారు ఇలాంటి పరీక్షలు మరెన్నో భవిష్యత్తులో నిర్వహించాలని ఆయన యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అరవపల్లి శంకర్ మాట్లాడుతూ తరగతి గదిలో పాఠ్యాంశానికి సంబంధించిన పుస్తకాలు మాత్రమే కాకుండా అబాకస్, వేదిక్ మాస్, ప్రాబ్లం సాల్వింగ్, రీజనింగ్ లాంటి వాటిలో కూడా నైపుణ్యం సాధించడానికి ప్రతి ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలు కృషి చేస్తే పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉంటుంది అని ప్రతివారు తల్లిదండ్రుల సహకారంతో ఇలాంటివి కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొని వచ్చే సంవత్సరం మరింత మంది విద్యార్థులు ఇలాంటి పథకాలు అందుకునే విధంగా కృషి చేస్తారని ఆశిస్తున్నానని వారికి ఎల్లవేళలా యాజమాన్యంగా ఆశీస్సులు ఉంటాయని తెలియజేశారు.