కోటమర్తి గ్రామంలో బిజెపి పార్టీ కార్నర్ మీటింగ్
అడ్డగూడూరు 10 మే 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి గ్రామంలో శుక్రవారం రోజు బిజెపి పార్టీ కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రసంగించిన అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ కూరాకుల వెంకటేశ్వరరావు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత పది సంవత్సరాలు సబ్ కా సాత్ ,సబ్ కా విశ్వాస్,సబ్ కా ప్రయాస్ నినాదాలతో కరోన విపత్కర పరిస్థితుల్లో ప్రజలతో వుండి కాపాడారని,పేదలందరికి జన్ ధన్ ఖాతాలను తెరిచి అవినీతి రహితంగా పేదవారికి అందల్సిన పథకాలు రైతులకు పెట్టుబడి సాయం నేరుగా వారికి అందేవిధంగాచర్యలు తీసుకుంటు. ప్రజల విశ్వాసాన్ని పొందారని,దేశాభివృద్ధికి అందరు తమవంతు శ్రమవారి రంగంలో పడేవిధంగా ఆత్మనిర్భర భారత్, మేడిన్ ఇండియా, కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు.80కోట్లు మందికి ఉచిత బియ్యం,ఎన్ ఆర్ ఈ జిఎస్ ధ్వారా ఉపాధి, సిసి రోడ్లు నిర్మాణం గ్రామాల్లో అభివృద్ధి కి.స్మశానవాటికలు ,డంపింగ్ యార్డులు, స్వచ్ఛ భారత్, చెట్లపెంపకం నర్నరీలు రైతులకు ఎరువుల సబ్సిడీ ధాన్యంకొనుగోలు,ధరలను రెట్టింపు చేయడం ద్వారా రైతుల ఆదాయం రెట్టింపు చేయడం, రోడ్లు,దేశ రక్షణ పటిష్టం చేయడం విదేశాంగ విధానం వల్ల మనం విశ్వగురువుగానిలబెబటం ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అతిపెద్ద ఐదవ స్థాయిలో నిలబెట్టి స్థిరమైన అభివృద్ధి చెందుతుంది అని అందుకే దేశంలో మోది భువనగిరిలో బూర నర్సయ్యని గెలిపించాలని కమలం పువ్వు గుర్తుకు ఓటువేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు ననుబోతు సైదులు పార్టీ ప్రధాన కార్యదర్శి సోమిరెడ్డి నర్సిరెడ్డి, ఉపాధ్యక్షుడు బీరుమల్లు, కార్యదర్శి గూడ అవిలయ్య సీనియర్ జిల్లా నాయకులు లింగాల శ్యాం సుందర్ రెడ్డి మండల ఓబిసి ప్రధాన కార్యదర్శి కొత్తోజు నవీన్ బూత్ అధ్యక్షులు గూడ కళమ్మ ,తోట అంజయ్య, మందుల శ్రీనివాస్ ఇటికాల యాదగిరి ,కూతాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.