ఎస్సీ కాలనీ మెయిన్  రోడ్డు దారి ఇలా  నడిచేది ఎలా

Oct 6, 2024 - 20:27
 0  0
ఎస్సీ కాలనీ మెయిన్  రోడ్డు దారి ఇలా  నడిచేది ఎలా

అధికారులకు పలుమార్లు విన్నవించుకున్న మా డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకున్న నాధుడే లేడు  తుంగతుర్తి అక్టోబర్ 6 తెలంగాణ వార్తా ప్రతినిధి  సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం పాత పోస్ట్ ఆఫీస్ ఏరియా ఈరోజు కురిసిన వర్షానికి  సామర్థ్యం సరిపోక పొర్లుతున్న మురుగుకాలువ. ఎస్సీ కాలనీ మొత్తం పరిస్థితి ఇదె ఈ కాలువ తుంగతుర్తి మెయిన్ రోడ్డు రెండు వైపులా  నుండి వచ్చే మురుగు నీరు మొత్తం ఈకాలువ ద్వారా పెద్దచెరువులోకి వెళ్తుంది. ఊరు వరద మొత్తం ఎస్సీ కాలనీ వైపు రావడంతో మురుగునీరు ఇళ్లల్లోకి చేరి మురుగు వాసనతో దోమలు చేరి    
 రోగాల బారిన పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం బురద అలానే ఉంటుంది బుర్ర ఆరే పరిస్థితి ఉండదు  ఎందుకంటే మురికి కాలువలు నీరు 24 గంటలు  రోడ్డు మీదకే వస్తుంది కాబట్టి,   ఎంతోమంది అధికారులు మారుతున్నారు, నాయకులు మారుతున్నారు,  కానీని వెలివేసిన వెలివాడల  బ్రతుకులు మాత్రం మారడం లేదు.తేలిక పాటి వర్షం వచ్చిన మురికి కాలువలు పొంగి పొరలి ఇళ్లల్లోకి నీరు చేరుతున్నాయి. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి పెద్ద డ్రైనేజీ కాలువలను నిర్మించి వాటర్ ఫ్రీగా వెళ్లే విధంగా  చర్యలు తీసుకొవాలని తుంగతుర్తి ఎస్సీ కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333