ప్రధాన రహదారిలో ప్రమాదకరంగా మారిన విద్యుత్ వైర్లు.

ఐజ మున్సిపాలిటీలోని పెట్రోల్ పంప్ చౌరస్తా రామన్ గౌడ్ వైన్ షాప్ పక్కన ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లు పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు. రోజుకు వేలకొద్ది జనాలు తిరిగే ప్రదేశంలో చెట్ల కొమ్మలలో విద్యుత్ వైర్లు ఒకటి ఒకటికి తలుగుతూ నిప్పు రవ్వలు పడడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దయచేసి విద్యుత్ శాఖ అధికారులు చొరవ తీసుకొని ఆ చెట్టు కొమ్మలను తొలగించాలని ఆ ప్రాంత ప్రజలు తెలియజేస్తున్నారు...