కొండపాక మండలంలో ఉపాధ్యాయుడు సస్పెండ్
డీఈవో ఉత్తర్వులను వెలువడిoచారని కొండపాక మండల ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణవార్త కొండపాక :- కొండపాక మండలం దుద్దెడ హైస్కూల్లో ఇంగ్లీష్ సబ్జెక్టు ఉపాధ్యాయుడు బాకి చంద్రబాను, పదవ తరగతి పరీక్ష కేంద్రం దుద్దెడలో ఇన్సులేషన్ గా నియామకం చేశారు. మార్చి 26న ఫిజిక్స్ పరీక్ష రాస్తున్న సోషల్ వెల్ఫేర్ స్కూల్ కు చెందిన ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించగా ఆ విద్యార్థి పరీక్షా కేంద్రంలో డిస్టర్బ్ అయి పరీక్షను సరిగా రాయలేక పరీక్ష కేంద్రం సూపరిండెంట్ లక్ష్మి కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పూర్తి నివేదిక అందించాలని ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డికి డీఈఓ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేశారు. మార్చి 30న వేరువేరుగా విచారణ చేపట్టి వివరాలను సేకరించిన నివేదికను ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి డీఈవో మరియు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి బాకీ చంద్రబాను సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులను వెలువడిoచారని కొండపాక మండల ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి వివరించారు.