అమ్మకానికి పెట్టిన పాపను కాపాడి  6 గురు నిందితులను అరెస్ట్ చేసిన మునగాల పోలీసులు

Apr 16, 2024 - 21:01
Apr 16, 2024 - 21:09
 0  135

జిల్లా పొలీస్ కార్యాలయం నందు కేసు వివరాలను మీడియా కు వెల్లడించిన జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే IPS గారు. 

  • పిల్లల అమ్మకానికి పాల్పడం నేరం.
    - ఇది ప్రోత్సహించిన, ప్రలోభపెట్టిన అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు.
  • --రాహుల్ హెగ్డే IPS, ఎస్పి సూర్యాపేట జిల్లా.

తేది 15/04/24 రోజు అందాజు సా.6 గంటల సమయంలో మునగాల పోలిసు స్టేషన్ పరిధి మొద్దులచెరువు స్టేజి వద్ద గొడవ జరుగుతున్నదని స్థానికులు ఇచ్చిన సమాచారం ఫై మునగాల స్టేషన్ సిబ్బంది అక్కడకు వెళ్లి వారిని విచారించగా పొలిసు వారిని చూసి నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయగా వారిని పట్టుబడి చేయడం జరిగినది. 

కేసు వివరాలు:  కేసును విచారించగా నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం నాయకుని తండా గ్రామానికి చెందిన మేరావాత్ పూల్ సింగ్ అనే 60 సం.ల వ్యక్తి తన కూతురు రాజేశ్వరి కి మొదటి సంతానము ఆడపిల్ల పుట్టగా మల్లి రెండవ సంతనగా 20 రోజుల క్రితం కూతురు జన్మిoచినది. రాజేశ్వరి కి ఇద్దరు కూడా ఆడపిల్లలు సంతానం కలగటంతో ఆమెకు ఆర్దికముగా భారం అవుతుందని పుట్టిన పాప ను ఎవరికైనా పిల్లలు లేని వారికి అమ్మి డబ్బులు సంపాదిస్తే నా కూతురు బాగు పడుతుందని, తన కూతురు రాజేశ్వరికి ఈ విషయం చెపితే తాను ఒప్పుకోదని తండ్రి A-1 మేరావత్ పుల్ సింగ్ అనుకున్నాడు.

 తన మేన కోడలు A-2) మేరావత్ దుర్గ కు గతంలో హాస్పిటల్ లో స్వీపర్ గా పనిచేసినప్పుడు పరిచయం అయిన A-3) షేక్ సైదమ్మ @ సాయిబీ ద్వారా పరిచయo అయిన A-4) ముడావత్ రాజా నాయక్ తో పిల్లల్ని దత్తత చేసుకొనే వారి గురించి అడుగగా అతను నాకు తెలిసిన వారు ఉన్నారని అందుకు గాను పాపను అమ్మగా వచ్చిన డబ్బులలో కొంత డబ్బు తీసుకొనే విధంగా A-1 & A-2 లతో A-4 ముడావత్ రాజా నాయక్ తనకు పరిచయం ఉన్న A-5) శివనేని నాగమణి ఇద్దరు కలిసి ఒప్పందం చేసుకున్నారు. నేరస్తులు A-4 & A-5 ఇద్దరు కలిసి విజయవాడకు చెందిన A-6 గరికముక్కు విజయ లక్ష్మి మరియు A-7 వాడపల్లి అశోక్ కుమార్ లు మధ్యవర్తులుగా రూ.3,00,000/- కు అమ్మేట్లు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం లో బాగంగా పాపను ఒక సారి చూసిన తర్వాత  మాట్లాడుకుందాం అని అని చెప్పి  మునగాల మండలం మొద్దులచెరువు స్టేజ్ వద్దకు పాపను తీసుకొని రమ్మనగా, A-4 & A-5 లు కలిసి A-1 & A-2 లు పాప తల్లి రాజేశ్వరికి మాయమాటలు చెప్పి తీసుకొని తేదీ 15.04.2024 అందజ సాయంత్రం 06.00 గంటలకు మొద్దులచెరువు స్టేజ్ దగ్గర లో గల ఖాళీ స్థలం లోకి వచ్చారు. ఆ సమయములో A-1 తన కూతురు  రాజేశ్వరి చేతుల నుండి పాపను బలవంతం గా లాక్కొని  A-6 & A-7 లకు ఇవ్వటంతో రాజేశ్వరి గట్టిగా ప్రశ్నించగా మీ పాపను మీ నాన్న మాకు రూ.3,00,000/- కు అమ్మినాడని చెప్పటం తో ఆమె ఏడుస్తూ తన పాపను తన దగ్గరకు తీసుకొనే ప్రయత్నం చేయగా వాళ్ళు ఇవ్వక పోవటంతో గట్టిగా కేకలు వేయగా చుట్టూ ప్రక్కల వాళ్ళు చూసి అక్కడికి వెళ్ళి విషయం తెలుసుకొని పోలీస్ వారికి తెలపగా  వెంటనే పోలీస్ వారు అక్కడకు వెళ్ళటం తో వారిని చూసి నేరస్తులు పారిపోతుండగా వారిని పోలీస్ వారు పట్టుబడి చేసినారు. వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చి ప్రశ్నించగా వారు తమ నేరమును అంగీకరింకరించడంతో దీనిపై మునగాల PS నందు సెక్షన్ 370 (4) IPC, సెక్షన్ 81 ఆఫ్ JJ యాక్ట్ ప్రకారం నేరము సంఖ్య 81/2024 కేసు నమోదు చేసి  A-1 , A-2, A-4 to A-7 లను అరెస్ట్ చేసి నిందితులను కోర్టు నందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించడం జరుగుతుంది.  A-3, A-8 , A-9, A-10 లు పరారీలో ఉన్నారు.   
 
ఈ కేసులో 6 సెల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగినది.

పిల్లలను అమ్మడం నేరము, ఈ రకమైన నేరానికి పాల్పడిన, ఇది ప్రోత్సహించిన, ప్రలోభపెట్టిన అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు. ఆడపిల్లల అభ్యున్నతికి వారి చదువులకు ప్రతిఒక్కరు కృషి చేయాలి అని ఎస్పి గారు కోరినారు.

గతంలో ఇదే రకమైన కేసుల్లో A4 రాజు నాయక్ పై, A6 విజయలక్ష్మి పై, A4 సిందు పై కేసులు నమోదైనట్లు తెలిసినది.

మీడియా సమావేశం నందు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీరరాఘవులు, మునగాల CI రామకృష్ణా రెడ్డి, మునగాల SI అంజి రెడ్డి, CCS SI సాయి ప్రశాంత్ ఉన్నారు.

 A-1     MeravathPul Singh, age: 65 years, Occ: Agriculture, R/o NayakuniTanda Village of TirumalagiriSagarMandal.

A-2     MeravathDurga age: 27 years, Occ: Coolie, R/o Macherla village and mandal of Palnadu District.

A-3     ShaikSaibee @ Saidammaage: 65 years Occ: Coolioe R/o Macherla village and mandal of Palnadu District (Absconding).

A-4     Mudavath Raja Naik age:33 years, Occ: Agriculture R/o MarasapentaThanda village, Vellurthimandal of Palnadu district.

A-5     Shivaneni Nagamani age: 54 years Caste: SC Mala Occ; ANM R/o Suryapet.

A-6     Garikamukku Vijayalakshmi W/o Raju age: 39 years Caste: SC Mala Occ: Private Job, R/o Gollapudi of Vijayawada city.

A-7     Vadapalli Ashok Kumar, age: 34 years Caste: Kapu, Occ: Auto Driver R/o Bhavanipuram of Vijayawada city.

A-8     BalagamSaroja, age: 29 yrs, Caste: Kapu, Occ:Private Job R/o Bhavanipuram , Vijayawada(Absconding).

A-9     GanjalaSindhu, age: 27 years, Occ: Private Job R/o Machilipatnam(Absconding).

A-10    NareshR/o Hyderabad(Absconding).

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333