ఫోన్ బాగు చేయించలేదని మనస్తాపంతో యువతి ఆత్మహత్య

Apr 12, 2024 - 18:24
 0  129
ఫోన్ బాగు చేయించలేదని మనస్తాపంతో యువతి ఆత్మహత్య

మంచిర్యాల - జైపూర్ మండలం వేలాల గ్రామానికి చెందిన ప్యాగ సారక్క, స్వామి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. 

అయితే కూతురు సాయిషుమా(19) సెల్ ఫోన్  బాగు చేయించమని తల్లిదండ్రులను అడిగింది, దీంతో తరచూ సెల్ఫోన్ పాడు చేస్తున్నావని తల్లి మందలించి, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు బాగాలేవని, కొద్ది రోజుల తర్వాత బాగు చేయిస్తామని చెప్పింది. 

అన్న అడిగితే బాగు చేయిస్తారు కానీ తాను అడిగితే మాత్రం ఏమీ చెయ్యరు అంటూ సాయిషుమా మనస్తాపంతో తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333