కార్డు జారీ కోసం జిల్లాలో క్యాంపుల సంఖ్యను పెంచాలి

Oct 1, 2025 - 22:18
Oct 1, 2025 - 22:33
 0  21
కార్డు జారీ కోసం జిల్లాలో క్యాంపుల సంఖ్యను పెంచాలి

భువనగిరి 01 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–

రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పెన్షన్స్ మంజూరు చేయాలని, సదరం సర్టిఫికెట్ ఉన్న ప్రతి ఒక్కరికి చేయాలని,కొత్తగా యు.డి.ఐ.డి కార్డ్స్ జారీ కోసం క్యాంపుల సంఖ్య పెంచాలని భువనగిరి టౌన్ అర్బన్ కాలనీ సమావేశానికి హాజరైన అధ్యక్షులుగా గోపి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఎన్.పీ.ఆర్.డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ..వికలాంగుల సమస్యల పరిష్కారం కొరకు తెలంగాణ రాష్ట్రంలో 8.17 లక్షల మందికి సదరం సర్టిఫికెట్స్ ఉన్నాయి.వీరిలో 4.90 లక్షల మందికి పెన్షన్స్ వస్తున్నవి.కాలపరిమితి ముగిసిన సదరం సర్టిఫికెట్స్ను రెన్యూవల్ చేయడానికి ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని సదరం సర్టిఫికెట్ స్థానంలో ప్రభుత్వం జారీ చేస్తున్న యూనిక్ డిసెబుల్డ్ గుర్తింపు కార్డు 2010 నుండి సదరం సర్టిఫికెట్ ఉన్న ప్రతి ఒక్కరికి జారీ చేయాలని వైకల్య ధ్రువీకరణ పత్రాల జారి కోసం ప్రస్తుతం నిర్వహిస్తున్న క్యాంపుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలకు యు.డి.ఐ.డికార్డు చెల్లుబాటు అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖలకు ఉత్తర్వులు జారీ చేయూలని.గత 3 నెలల నుండి సదరం సర్టిఫికెట్ స్థానంలో ప్రభుత్వం జారీ చేసిన యు.డి.ఐ.డి కార్డు జిల్లా వ్యాప్తంగా రాయితీ బస్ పాసులు ఇవ్వడం లేదు.21రకాల వైకాల్యలకు యు.డి.ఐ.డి కార్డు జారీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులతో ఏర్పాటు చేస్తున్న 18 వేల సెల్ఫ్ హెల్ఫ్ గ్రూప్ లలో రాష్ట్రంలో ఉన్న ప్రతి వికలాంగుణ్ణి చేర్చుకునే విదంగా చర్యలు తీసుకోవాలి. గ్రామానికి 5-10 మంది చొప్పున తీసుకుంటే మిగతా వికలాంగులకు తీవ్ర నష్టం జరుగుతుంది.సెల్ఫ్ హెల్ఫ్ గ్రూప్ లలో చేరిన వికలాంగులకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు కృషి చేయాలి.చేయూత పెన్షన్స్ కు ఆదాయ పరిమితి విధించే జీవో 17లో కఠినంగా ఉన్న నిబంధనలను సరళతరం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్.పి.ఆర్. డి జిల్లా కోశాధికారి కొత్త లలిత అర్బన్ కాలనీ 16 వార్డు కమిటీ అధ్యక్షులు సిహెచ్ తిరుమల్ కార్యదర్శి వేషాల గోపి ఉపాధ్యక్షురాలు గిరికల లక్ష్మి సహాయక కార్యదర్శి కె విటల్ కోశాధికారి తోట సంతోష్ కుమార్ మంచు రాజేంద్రప్రసాద్ రాము తదితరు పాల్గొన్నారు.