ఘనంగా వాల్మీకి సంఘం అధ్యక్షులు రాజు జన్మదిన వేడుకలు

చిన్నంబావి మండలం 01అక్టోబర్ 2025తెలంగాణ వార్త :-
కొల్లాపూర్ తాలూకా వాల్మీకి సంఘం అధ్యక్షులు రాజ్ కుమార్ జన్మదిన సందర్భంగా కొల్లాపూర్ లోని విశ్వశాంతి హెల్పర్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు, బ్రెడ్, పండ్లను పంపిణీ చేశారు. అనంతరం వేడుకలు సోమశిల లో మిత్రబృందం బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అష్ట ఐశ్వర్యాలతో,సుఖసంతోషాలతో, వర్ధిల్లాలని అనుకున్న లక్ష్యాలను ఎలాంటి ఆటంకం లేకుండా చేరుకోవాలని కోరుకుంటూ మనస్పూర్తిగా మిత్ర బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.*. *ఈ వేడుకలలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామకృష్ణ, మండల వాల్మీకి సంఘం అధ్యక్షుడు ఉమేష్ నాయుడు, కృష్ణమా నాయుడు, రాం చందర్ కొల్లాపూర్ మండల అధ్యక్షుడు కురుమయ్య నాయుడు, టీచర్ వెంకటేశు, జ్యోతి గౌడు, రామన్ గౌడు, మరాఠీ సుధాకర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం సుధాకర్ నాయుడు ఈ వేడుకలలో పాల్గొన్నారు*