వరికి ఒక్క తడి అందించండి రైతుల ఆవేదన

జోగులాంబ గద్వాల ఐదు ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ఐజ. ఆర్డీఎస్ ఆయకట్టు కింద సాగు చేసిన వరి పంటలు పూర్తిగా ఎండుముఖం వేశాయి. కనీసం ఇప్పుడైనా ఒక్క తడి నీరు అందించండి అని డి. 22, 2 3 కింద వరి పంట రైతులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. ఎగువ నుంచి వస్తున్న నీటికి కాలువలో అక్కడక్కడ అడ్డుకట్ట వేసి నీటిని ఆపుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయ చేసి సంబంధిత అధికారులు డి.22,23 వరకు నీరు పారే విధంగా చర్యలు తీసుకోని ఒక్క తడి నీరు అందించాలని రైతులు కోరుతున్నారు.