కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం  చేయడం మానుకోవాలి 

చకిలం రాజేశ్వర రావు.

Dec 8, 2024 - 20:04
Dec 9, 2024 - 09:07
 0  4
కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం  చేయడం మానుకోవాలి 

రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి..

కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఒక సంవత్సరం అయి అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకుంటుంటే కళ్ళ  మంటతో బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వర రావు ఒక ప్రకటన లో తెలియజేశారు.

తెలంగాణ తల్లి విగ్రహం పై అనవసర రాద్దాంతం తగదు. 10 సంవత్సరాలు పరిపాలించి, తెలంగాణ ను దోచుకుని తిన్న బిఆర్ఎస్ నాయకులు, తెలంగాణ పరిపాలనా కేంద్రం సెక్రెటేరియట్ లో  కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన తెలంగాణను ప్రతిబింబించేటట్టు తల్లి విగ్రహాన్ని ప్రతిష్టిస్తుంటే, ఓర్వలేక పోతున్నారు.

10 సంవత్సరాలలో బి.ఆర్.ఎస్ చేయలేనిది ఒక్క సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించింది.

రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.

# అధికారంలోకి వచ్చి సంవత్సరంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాం..
ఇక రెండవ సంవత్సరంలో అభివృద్ధి లో వేగం పెంచుతాం.. 

అధికారం కోల్పోవడంతో బి.ఆర్.ఎస్ నాయకులు దిక్కు తోచని స్థితిలో ఏమి మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు.

లా అండ్ ఆర్డర్ దెబ్బతినేలా రెచ్చగొట్టే విధంగా బి.ఆర్.ఎస్. నాయకులు వ్యవహరిస్తున్నారు. 

నాడు బెడ్ రూం తలుపులు బద్దలు కొట్టి, కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురాచేసి రేవంత్ రెడ్డి గారిని అరెస్టు చేయలేదా..‌

బిఆర్ఎస్ నాయకులు ద్వంద్వ వైఖరి మార్చుకోవాలి. 

ఎమ్మెల్యేలు హరీష్ రావు, కెటిఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. వారి ఆటలు సాగనీయం.

ప్రతిసారి అనవసరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని విమర్శించడం మానుకోవాలి.

మూసీ నది పునరుజ్జీవం పై విమర్శలు మానుకోవాలని, లేక పోతే నల్లగొండ జిల్లా ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు..

ఏడాది అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటే తోకముడిచిన బి.ఆర్.ఎస్.నాయకులు.

పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన రాలేదని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారని 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో చేయలేని పనులను సంవత్సరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించిందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని, ఇంకా రెట్టింపు వేగంతో మరికొన్ని అభివృద్ధి పనులు రాష్ట్రంలో త్వరలోనే ప్రారంభిస్తుంది అని చకిలం అన్నారు.  అసలైన తెలంగాణ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్న సమయంలో  విమర్శలు చేయడం తగదని ఇప్పటికైనా బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహంపై రాద్ధాంతం మానుకోవాలి అని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం భేషజాలకు పోకుండా ప్రతిపక్ష నాయకుడు కె.సి.ఆర్ ను తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కు సగౌరవంగా ఆహ్వానించి గౌరవించిందని, ఆ గౌరవం నిలుపుకుని విగ్రహావిష్కరణ కు హాజరు కావాలని అన్నారు. లేక పోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు..

సంవత్సరం పాలనపై బిఆర్ఎస్ నాయకులు సిద్ధమా అని సవాల్ విసిరారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వేగంగా ముందుకు వెళుతుందని అన్నారు. అధికారం కోల్పోవడంతో బిఆర్ఎస్ నాయకులు ప్రతి చిన్న విషయానికి పెద్దగా చేస్తూ అవాకులు చవాకులు పేలుతూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. 

మంత్రి హోదాలో పనిచేసిన హరీష్ రావు గారు సంవత్సర పాలనపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడడం హాస్యాస్పదం అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరింత హుందాగా వ్యవహరించాలని కోరారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ సద్వినియోగం చేసుకొని ప్రజలకు మెరుగైన పాలన అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజలకు కట్టుబడి బాధ్యతగా వ్యవహరించాలని ప్రభుత్వానికి మంచి చెడు సూచనలు చేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం కాంగ్రెస్ పార్టీని విమర్శించడం బిఆర్ఎస్ నాయకులు పనిగా పెట్టుకున్నారని అన్నారు. పోలీసు రాజ్యం నడుస్తుంది అంటున్న టిఆర్ఎస్ నాయకులు నాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెడ్ రూమ్ తలుపులు పగలగొట్టి అరెస్టు చేయలేదా మీరా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించేది అని మండిపడ్డారు. ఇకనైనా మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకొని బాధ్యతగా ఉండాలని అన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333