వేల గొంతుకలు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
భారీ ప్రదర్శనకు సంఘీభావం తెలుపుతూ మాదిగ జర్నలిస్టుల ఫోరం రాలి
తుంగతుర్తి ఫిబ్రవరి 3 తెలంగాణ వార్త ప్రతినిధి : తుంగతుర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం నుండి తెలంగాణ తల్లి విగ్రహం భారీ ర్యాలీ, వరకు ఎస్సీ వర్గీకరణ కోసం ఈనెల 7 న హైదరాబాద్ నడిబొడ్డున కృష్ణ మాదిగ సారధ్యంలో జరిగే వేల గొంతుకలు, లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తుంగతుర్తి మాదిగ జర్నలిస్టులు పిలుపునిచ్చారు. భారీ సాంస్కృతిక ప్రదర్శనకు సంఘీభావం తెలుపుతూ తుంగతుర్తి మాదిగ జర్నలిస్టుల ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా తో పాటు మాదిగ జర్నలిస్టులు మాట్లాడుతూ... మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ కోసం అనేక పోరాటాలు చేయడం జరిగిందన్నారు. న్యాయమైన ఎస్సీ వర్గీకరణ కోసం ఈ రోజున మందకృష్ణ మాదిగ చేపట్టిన ఉద్యమానికి అన్ని కులాలు వివిధ పార్టీలో ప్రజాసంఘాలు కుల సంఘాలు సంఘీభావం తెలపడం చారిత్రాత్మకమన్నారు. సుప్రీంకోర్టు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడంతో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట కట్టుబడి వర్గీకరణ చేయాలని కోరారు. ఈ భారీ ప్రదర్శన కార్యక్రమానికి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ శంకరం డప్పు వేసుకొని హైదరాబాద్ కు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు కొండగడుపుల లక్ష్మణ్, కొండగడుపుల ఎల్లయ్య, ఆకారపు ఎల్లయ్య,పోతురాజు వెంకన్న, ఇరుగు సైదులు, తడకమల్ల రవికుమార్,వంగాల వెంకన్న, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కొండగడుపుల శ్రీనివాస్, మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ జిల్లా అధికార ప్రతినిధి మల్లెపాక రవీందర్, నియోజకవర్గ అధ్యక్షులు పోలేపాక వీరమల్లు, మండల అధ్యక్షుడు చింతకుంట్ల అంబేద్కర్, నూతనకల్ మండల అధ్యక్షుడు పాల్వాయి పరశురాం, పోలేపాక అంజయ్య,ఆకారపు సైదులు,సామాజిక ఉద్యమ నాయకులు ఎనగందుల మల్లేష్ నేత, కలకోట్ల మల్లేష్, మాచర్ల అనిల్, మంగళపల్లి నాగరాజు, కత్తుల నరేష్, మంగళపల్లి ఆనందరావు,కొండగడుపుల నవీన్, బొంకూరి నవీన్, లక్ష్మీకాంత్, రవిశంకర్,ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.