నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ పాఠశాలు

జిల్లాలో విద్యాశాఖ అధికారులు వారు ఉన్నట్టా లేనట్టా..?

Dec 8, 2024 - 20:03
 0  10
నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ పాఠశాలు

జిల్లాల విద్యాశాఖ తనిఖీలు శూన్యం..?

 విద్యాశాఖ గైడ్లైన్స్ ను తుంగలో తొక్కి ,సెలవులు రోజుల్లో కూడా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు  నడుపుతూనే ఉన్నారు.

జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవేట్ పాఠశాలలు నడుపుతున్న, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై జిల్లా కలెక్టర్ చర్యలేవి..?

జోగులాంబ గద్వాల 8 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల జిల్లాకేంద్రంలో ప్రభుత్వానికి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేటు పాఠశాలలు గద్వాల జిల్లాలో కొందరు మాత్రమే  మమ్ములను ఎవరు ఏమి చేయలేరు మమ్మల్ని ఎవరు ఆపలేరు మేము చెప్పిందే వింటారు అధికారులు అన్నట్టు ప్రవేట్ పాఠశాలల యజమాన్యం తీరు. ఎందుకు ఈమాట అంటున్నామంటే  ప్రభుత్వం నియమాలను పాటించని ప్రవేట్ పాఠశాలలు ఆదివారం రోజు ప్రత్యేక క్లాసుల పేరుతో పాఠశాలలు నడుపుతున్న శ్రీ చైతన్య,కాకతీయ పలు గద్వాల్ ప్రైవేట్ పాఠశాలలు ఇది తెలుసుకున్న బీఆర్ఎస్వి నాయకులు పాఠశాలకు చేరుకుని విద్యార్థులను ఇంటికి పంపడం జరిగింది.ఇలా విరుద్ధంగా నడుపుతున్న ప్రవేట్ పాఠశాలను గుర్తించి విద్యాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలలి ఈ పాఠశాలల మీద ఎన్ని సార్లు కంప్లీట్ చేసిన ఎంఈఓ మరియు డీఈవో  ఎందుకు ఈపాఠశాలల మీద చర్యలు తీసుకోవడం లేదు జిల్లా కలెక్టర్,డీఈఓ మీద ఎంఈఓ మీద చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333