కాంగ్రెస్ పాలన అంటే రాస్తారోకలు ధర్నాలు రోడ్లపైకి రావడం
చివరికి చదువుకునే విద్యార్థులు కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు.
విద్యార్థుల కోసం స్టేజీల మీద బస్సులు కచ్చితంగా ఆపాలని డిమాండ్ చేస్తున్నాం.
BRSV రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య
జోగులాంబ గద్వాల 4 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల ఈ సందర్భంగా కురువ పల్లయ్య మాట్లాడుతూ డిపో డిఎం నిర్లక్ష్యం వల్లనే జిల్లాలో విద్యార్థులకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయి * తక్షణమే జిల్లా డిపో మేనేజర్ పైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని డిమాండ్ చేస్తున్నాం పర్దిపురంలో రోడ్డుపైన బైఠాయించిన విద్యార్థులు అలంపూర్ నియోజకవర్గం అయిజ మున్సిపాలిటీ పరిధిలో పర్దిపురం స్టేజి దగ్గర బస్సులు ఆపడం లేదని. మరియు పాఠశాల సమయంలో ప్రత్యేకమైన ఒక బస్సు నడపాలని డిమాండ్ చేస్తూ ఇప్పుడు వచ్చే బస్సులు నిండి రావడంతో ఆ బస్సులో ఆపడం లేదు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆగ్రహించి రోడ్డుపై నిరసన తెలుపుతూ బేటాయించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాపాలనంటే రోడ్లపైన ధర్నాలు చేయడమేనా అని అన్నారు తక్షణమే విద్యార్థులు కు ప్రత్యేకమైన బస్సులు నడపాలని మరియు ప్రతి స్టేజ్ దగ్గర కూడా విద్యార్థుల కోసం బస్సులు ఆపాలని డిమాండ్ చేశారు అదేవిధంగా డ్రైవర్లు కండక్టర్లు చదువుకున్న విద్యార్థులు ఉన్నచోట బస్సు ఆపకుండా గా వెళ్లిపోవడం వల్ల చాలా తీవ్రమైన ఇబ్బంది కలుగుతుందని అన్నారు. అదేవిధంగా ఐజ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ దగ్గర కూడా బస్సులు ఆపకపోవడం వలన జూనియర్ కాలేజీ విద్యార్థులకు తీవ్రమైన అంతరాయం కలుగుతుంది ప్రతిరోజు దీన్ని గమనించి తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లాలో చాలా చోట్ల కూడా విద్యార్థులు ఇప్పటికే రోడ్ల పైన వచ్చి బస్సులాపాలని ధర్నాలు చేస్తూ ఉంటే..జిల్లా డిఎం నిమ్మకు నీరుతున్నట్టు నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా బాధాకరం తక్షణమే జిల్లా కలెక్టర్ డిఎం ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
లేనిపక్షంలో త్వరలోనే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని అన్నారు.