నారాయణ పేట జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శిక్తా పట్నాయక్
నారాయణపేట జిల్లా నూతన కలెక్టర్గా శిక్తా పట్నాయక్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న శిక్తా పట్నాయక్ నారాయణ పేట జిల్లా కలెక్టర్ గా బదిలీ అయిన సందర్భంగా ఆదివారం ఇక్కడి జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్లో
జిల్లా కలెక్టర్గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ను జిల్లా రెవెన్యూ ఆదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కలెక్టరేట్ ఏ.ఓ. నర్సింగరావు, డిపిఆర్ఓ ఎం.ఏ.రషీద్, కలెక్టరేట్ వివిధ సెక్షన్ ల పర్యవేక్షకులు, సిబ్బంది, అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు. కాగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ శిక్తా పట్నాయక్ కలెక్టరేట్ లోని వివిధ విభాగాల కార్యాలయాలను పరిశీలించారు.