తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ  సంక్రాంతి , పండుగ  శుభాకాంక్షలు 

Jan 13, 2025 - 18:47
Jan 13, 2025 - 19:29
 0  4

తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ (సూర్యాపేట టౌన్ జనవరి 13 ) తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ  సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు పంతంగి వీరస్వామి గౌడ్ తెలియజేశారు. మకరరాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే మకర సంక్రాంతి ప్రజల జీవితాల్లో మరిన్ని వెలుగులు నిండి సుఖశాంతులతో జీవించాలని సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు  పంతంగి వీరస్వామి గౌడ్ సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి విలేకరులతో మాట్లాడారు.  భోగి పండుగ అంటే మీలోని చెడును అగ్నికి ఆహుతి చేసి మంచిని నింపడమే ఈ భోగి పండుగ మీ ఇంట కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్బంగా ప్రజలందరికీ ఆయన భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.  తెలంగాణ రాష్ట్రంలో పాడిపంటలతో, సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఉండాలి అని   పండుగలన్నీ ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలని  చెప్పుకొచ్చారు.  ఈ సంక్రాంతి పండుగతో తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో   ఆనందంగా ఉండాలని అన్నారు.  ప్రజలంతా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య ఈ పండగలను జరుపుకోవాలన్నారు. ప్రధానంగా ఈ పండగ సందర్భంగా పతంగులు ఎగురవేసే ప్రతి ఒకరు జాగ్రత్తలు, నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు జిల్లా కార్యదర్శి మండాది గోవర్ధన్ గౌడ్ పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి పట్టణ కార్యదర్శి పట్టేటి కిరణ్  అయితే గాని మల్లయ్య గౌడ్ ఆకుల మారయ్య గౌడ్ ఖమ్మంపాటి అంజయ్య గౌడ్ రాపర్తి జానయ్య గౌడ్ దండి వెంకటరెడ్డి తండు సైదులు గౌడ్ నిలయ మధు  తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333