కవులు కళాకారులు సమాజాన్ని చైతన్యవంతం చేయాలి.
కవులు, కళాకారులు సమాజాన్ని చైతన్యవంతం చేయాలి
తెలంగాణ వార్త 10.12.2024.జిల్లా ప్రతినిధి:- హోప్ స్వచ్ఛంద సేవా సమితి మరియు సింధు అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు దైద వెంకన్న.సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద బాలాజీ నగర్ లో హోప్ స్వచ్ఛంద సేవా సమితి మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి దైద అనిత ఆధ్వర్యంలో అభ్యుదయ కవి విప్లవ కవి మహాకవి శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) 114వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించాము ఈ కార్యక్రమానికి హోప్ స్వచ్ఛంద సేవా సమితి మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థ అధ్యక్షులు దైద వెంకన్న ముఖ్యఅతిథిగా హాజరై శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాము అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ శ్రీ గారు అభ్యుదయ వాదిగా, విప్లవ కవిగా , అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా పని చేశారు సినీ గేయ రచయితగా సుప్రసిద్ధులు శ్రీశ్రీ గారు 20వ శతాబ్దంలో తెలుగు సాహిత్యాన్ని శాసించిన గొప్ప కవి రచయిత విప్లవ కవిగా సినీ గేయ రచయితగా కీర్తి ప్రతిష్టలు పొందారు ఆయన రచించిన మహాప్రస్థానం కావ్యం నాటినుండి నేటి వరకు ప్రాచుర్యం పొందింది సామాజికవేత్తగా ,విప్లవ భావజాలం ఉన్న శ్రీశ్రీ గారు బాల్యం నుండి ఎన్నో ఇబ్బందులు పడి గొప్ప కవిగా,రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన కావ్యాలు రచనలు సినీ విప్లవ,గేయాలు భారతదేశంలోని కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా కీర్తి ప్రతిష్టలు పొందాయి నేటి కవులు కళాకారులు రచయితలు శ్రీశ్రీ గారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హోప్ స్వచ్ఛంద సేవా సమితి మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి దైద అనిత మహాబాద్ జిల్లా కురవి మండల టిఆర్ఎస్ నాయకులు చిట్టే పు రెడ్డి వెంకట్ రెడ్డి ఎం ఎస్ పి పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టల మల్లేష్ తరాల కిరిటీ, తదితరులు పాల్గొన్నారు.