ఐరన్ హార్డ్వేర్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

ఐరన్ హార్డ్వేర్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు.
సూర్యాపేట, 16 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- ది సిమెంట్ ఐరన్ హార్డ్‌వేర్ పెయింట్ ప్లైవుడ్ డెకోలం అండ్ శానిటరీ మర్చంట్స్ అసోసియేషన్ సూర్యాపేట ఆధ్వర్యంలో 78 వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట కొత్త బస్టాండు సమీపంలో నిర్వహించిన వేడుకలలో అసోసియేషన్ అధ్యక్షులు సంకినేని గోపాలరావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా అయిన తరువాత ఐరన్ అండ్ హార్డ్‌వేర్ వ్యాపారం పెరిగిందని అన్నారు. వ్యాపారుల సమస్యల పరిష్కారం కోసం అందరూ సంఘటితమై పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శులు తల్లాడ వెంకటేశ్వర్లు, సోమ దయాకర్ , కోశాధికారి నల్లపాటి శ్రీకాంత్, పర్వతం మదనాచారి, శ్రీ రామదాసు వెంకటాచారి, కందిబండ శ్రీనివాస్, వీర్లపాటి శ్రీనివాస్, పూర్ణ, ఫిరోజ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.