భద్రాచలం ఏరియా ఆసుపత్రికి మోక్షం ఎప్పుడు....?

జాతీయ మానవ హక్కుల సంఘం*

Jan 28, 2025 - 17:41
Jan 28, 2025 - 17:43
 0  17
భద్రాచలం ఏరియా ఆసుపత్రికి మోక్షం ఎప్పుడు....?

భద్రాచలంలో పరిసర ప్రాంతాల్లో ఎక్కడలేనటువంటి 200 పడకల సామర్థ్యం కలిగిన ఏరియా ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేకపోవడం చాలా బాధాకరం. అలాగే భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చాలా నెలలుగా సిబ్బంది కొరత కూడా ఉంది. అలాగే స్కానింగ్ మరియు ఎక్స్ రే లాంటి సదుపాయాలు పూర్తిస్థాయిలో అందరికీ అందకపోవడం. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఆంకాలజీ డాక్టర్లు మరియు టెక్నీషియన్లు కూడా పూర్తిస్థాయిలో లేరు. స్థానిక ఎమ్మెల్యే, ఐటీడీఏ పీవో, డి ఎం హెచ్ ఓ మరియు హెల్త్ డైరెక్టర్లు విడతల వారీగా ఏరియా ఆసుపత్రిని సందర్శిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటికీ ఏరియా ఆసుపత్రిలోని అన్ని వైద్య సదుపాయాలకి కావాల్సినంత సిబ్బంది ని అమర్చలేకపోతున్నారు. అలాగే నాలుగు రాష్ట్రాల సరిహద్దు అయినటువంటి భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో అనునిత్యం రద్దీతో ఉంటుంది ఇటువంటి చోట పరిశుభ్రత అనేది చాలా ముఖ్యమైన విషయం. కానీ ఆసుపత్రిలో శానిటేషన్ సిబ్బంది పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం సిబ్బంది కొరత ఉండటం వలన శుభ్రత అనేది కొన్ని వార్డులకు మాత్రమే ఉంటుంది. ఇదిలా ఉంటే ఆసుపత్రిలోని సిబ్బంది కూడా చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారని గర్భిణీ స్త్రీ తాలూకు వ్యక్తులు కూడా చెప్తున్నారు. కొంతమంది కాంట్రాక్టు ఉద్యోగులు బయోమెట్రిక్ వేసి వెళ్ళిపోతున్నారు అని, అలాగే ఆసుపత్రిలో సీసీ కెమెరా పర్యవేక్షణ లోపం కూడా ఉందని దీనివలన ఆసుపత్రిలో అభద్రతాభావం పెరిగింది అలాగే రాత్రిపూట కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు కూడా భద్రాచలం ఏరియా ఆసుపత్రి అడ్డగా మారింది. ఇదిలా ఉంటే ఆసుపత్రిలో ప్రస్తుతం పని చేసే డాక్టర్లకు వారి సొంత ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. దీనివలన వారు పూర్తిస్థాయిలో ఏరియా ఆసుపత్రి మీద దృష్టి పెట్టడం లేదు. ఆసుపత్రి పగ్గాలు అంతా ఒక ప్రైవేటు ఆసుపత్రి యజమాని చేతుల పెట్టడం వలన ప్రభుత్వ ఆసుపత్రి యొక్క విలువ తగ్గుతుందని అలాగే నాణ్యమైన వైద్యం ప్రైవేటు ఆసుపత్రిలో చేసినట్టు భద్రాచలం ఆసుపత్రిలో ఎందుకు చేయలేకపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కి ఒక ఆసుపత్రి ఉంది ఒక ఆసుపత్రి ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు అనేది ఒక డాక్టర్ గా ఆయనకు తెలుసు.. ఈ సమస్యకు వెనువెంటనే పరిష్కరణ చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా మెడికల్ సంబంధిత అధికారులకు అలాగే తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారికి జాతీయ మానవ హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తుంది. ఈ కార్యక్రమంలో గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి, గుగులోత్ బాబు, పోడుతూరి ప్రేమ్ సాయి మరియు జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు నక్క సాయిబాబు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333