జిల్లాస్థాయి ప్రతిభ అవార్డులు అందుకున్న అధికారులు
సూర్యాపేట, 16 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- స్వతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు .యన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరై, జిల్లా కలక్టర్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ పోలీసు గౌరవ వందనం స్వీకరించిన త్రివర్ణ పథకాన్ని ఎగురవేశారు. జిల్లా ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి ప్రజలకు అందించిన పథకాలు, అభివృద్ధి గురించి వివరించారు. పరేడ్ ను పరిశీలించారు. విద్యార్థుల చేత సమకుతిక నృత్య ప్రదర్శనను తిలకించి చిన్నారులను బహుమతులతో, ప్రశంసలతో ఆశీర్వదించారు. స్వతంత్ర సమరయోధులు ప్రభుత్వం తరపున సన్మానం చసినారు. విధులు నిర్వహణలో ప్రతిభ చూపిన.అన్ని శాఖల సిబ్బందికి కలక్టర్, ఎస్పి పత్రాలు అందించారు. అనంతరం వివిధ శాఖలు ప్రదర్శించిన అభివృద్ధి స్తాల్స్ ను సందర్శించారు.
స్వతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా రాష్ట్ర స్థాయి పోలీసు పథకాలను కలెక్టర్ ఎస్పీ అందించారు. పరేడ్ కమాండర్ గా AR అధనపు ఎస్పి జనార్ధన్ రెడ్డి వ్యవహరించారు.
రాష్ట్ర స్థాయి పోలీస్ పథకాలు
ఉత్తమ సేవా పథకం ఏఆర్ఎస్ఐ ఎస్ వెంకన్న, సేవా పథకాలు హెడ్ కానిస్టేబుల్ వై.యాదగిరి పెన్పహాడ్ పిఎస్, హెడ్ కానిస్టేబుల్ బి.శ్రీనివాసరావు కోదాడ రూరల్ పిఎస్, హెడ్ కానిస్టేబుల్ జి.చంద్రశేఖర్ రెడ్డి జిల్లా స్పెషల్ బ్రాంచ్, హెడ్ కానిస్టేబుల్ జి.సత్యనారాయణ జిల్లా స్పెషల్ బ్రాంచ్ రాష్ట్రస్థాయి ఉత్తమ సేవ మరియు సేవా పథకాలను అందుకున్నారు ఈ సందర్భంగా వీరికి అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా అవార్డులు
జిల్లాస్థాయి ప్రతిభా అవార్డులు అందుకున్న వారిలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, అర్ముడ్ అదనపు ఎస్పి జనార్దన్ రెడ్డి, సిఐలు హుజూర్నగర్ సిఐ చరమందరాజు, సూర్యాపేట రూరల్ సీఐ సురేందర్ రెడ్డి, అనంతగిరి ఎస్సై నవీన్, సూర్యాపేట ట్రాఫిక్ SI సాయిరాం, సూర్యాపేట టౌన్ ఎస్ఐ కుశలవ, కమ్యూనికేషన్ ఎస్సై రాంబాబు, ఆర్ ఎస్ ఐ లు అశోక్, అన్వర్, ASI శంకర్, ఏ ఆర్ ఎస్ ఐ శ్రీనివాస్ మహిళా ఎస్సై సైదాబీ ఉన్నారు, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ ఆఫీసర్స్ ఉన్నారు.
ఆకర్షణగా పోలీస్ స్టాల్స్
స్వతంత్ర దినోత్సవం వేడుకల సంద్భంగా ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసే స్టాల్ లో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆర్ముడ్ స్టాల్, షీ టీమ్స్, బరోసా సెంటర్ స్టాల్ లు ఏర్పాటు చేయడం పట్ల పౌరులు, అధికారులు ఆసక్తికరంగా తిలకించారు. జిల్లా కలక్టర్ కు ఎస్పి ఆయుధాల గురించి వివరించారు.